
బొత్సకు సీరియస్, బ్రైన్ స్ట్రోక్
గురువారం అర్ధరాత్రి తర్వాత బొత్సకు బ్రైన్ స్ట్రోక్ రాగా కుటుంబసభ్యులు హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చించారు
వైసీపీ సీనియర్ నేత, ఎంఎల్సీ బొత్స సత్యానారాయణ ఆసుపత్రిలో చేరారు. గురువారం అర్ధరాత్రి తర్వాత బొత్సకు బ్రైన్ స్ట్రోక్ రాగా కుటుంబసభ్యులు హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చించారు. ఆసుపత్రిలో బొత్స చేరగానే డాక్టర్లు అత్యవసర చికిత్స అందించటంతో ప్రస్తుతం ఆరోగ్య పరిస్ధితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. కొద్దిరోజులుగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణలు ఏపీ రాజకీయాలను కలుషితం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణల్లో ఇటు కూటమి ప్రభుత్వం అటు వైసీపీ నేతలు ఒకరిపై మరొకరు తీవ్రంగా ఆరోపణలు, ప్రత్యారోపణలతో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో వైసీపీ తరపున కూటమి ప్రభుత్వం ఆరోపణలకు బొత్స చాలా బలంగా సమాధానాలు చెబుతున్నారు. ఈ నేపధ్యంలోనే బొత్సకు బాగా టెన్షన్ పెరిగిపోయినట్లు డాక్టర్లు అనుమానిస్తున్నారు. అందుకనే బొత్సకు గురువారం ముందు అనారోగ్యం మొదలై చివరకు బ్రైన్ స్ట్రోక్ కు దారితీసినట్లుగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

