బీసీలకు పెద్ద షాకిచ్చిన బీఆర్ఎస్
x
Buttemgari Madhava Reddy campaigning as BRS candidate

బీసీలకు పెద్ద షాకిచ్చిన బీఆర్ఎస్

కేశవాపురం పదో వార్డుకు కౌన్సిలర్ గా బుట్టెంగారి బీఆర్ఎస్ తరపున నామినేషన్ వేశాడు


బుట్టెంగారి మాధవరెడ్డి...ఈపేరు కొద్దిరోజుల క్రితం తెలంగాణలో మారుమోగిపోయింది. కారణం ఏమిటంటే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం బీసీలకు స్ధానికసంస్ధల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని డిసైడ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు(GO 9) కూడా జారీచేసింది. ప్రభుత్వం ఉత్తర్వులు ఇలా జారీ చేసిందో లేదో వెంటనే సుప్రింకోర్టులో కేసుపడింది. ఏమనంటే(BC Reservations) బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు లేదని. కేసు దాఖలు చేసింది ఎవరంటే రెడ్డి జాగృతి స్ధాపకుడు(Buttemgari Madhava Reddy) బుట్టెంగారి మాధవరెడ్డి. కేసును విచారించిన సుప్రింకోర్టు ప్రభుత్వ ఉత్తర్వులను తప్పుపట్టింది. దాంతో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు నిలిచిపోయింది.

కేసు వేసింది ఎవరనేది మొదట్లో చాలామందికి తెలీలేదు. కేసు విచారణ, సుప్రింకోర్టు ఆదేశాల నేపధ్యంలో కేసు వేసింది ఎవరనే సమాచారం కోసం బాగా వెతికారు. అప్పుడు బుట్టెంగారి మాధవరెడ్డి అని తెలిసింది. ఇంకేముంది పేరులో రెడ్డి అనుంది కాబట్టి రేవంత్ కు కనెక్షన్ కలిపేశారు. బీసీలకు రిజర్లేషన్లు అమలుచేయటం ఇష్టంలేని రేవంతే పరోక్షంగా బుట్టెంగారితో సుప్రింకోర్టులో కేసు వేయించినట్లు బీఆర్ఎస్ చాలారోజులు టన్నుల కొద్ది బురదచల్లేసింది. బుట్టెంగారితో తమకు ఎలాంటి సంబంధంలేదని కాంగ్రెస్ నేతలు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. దాంతో బీసీ సంఘాల్లో కూడా పెద్దఎత్తున ప్రభుత్వంపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమైంది.


సరే, ఇదంతా ఎప్పుడో జరిగిపోయిన విషయం కదా. ఇపుడెందుకు బుట్టెంగారి సోదంతా ? ఎందుకంటే, మున్సిపల్ ఎన్నికల్లో అతగాడు కౌన్సిలర్ గా పోటీచేస్తున్నాడు. మేడ్చల్ నియోజకవర్గం, మూడు చింతలపల్లి మున్సిపాలిటి పరిధిలోని కేశవాపురం పదో వార్డుకు కౌన్సిలర్ గా బీఆర్ఎస్ తరపున నామినేషన్ వేశాడు. జోరుగా జరుగుతున్న ప్రచారంలో సీనియర్ నేత, మాజీ మంత్రి చేమకూర మల్లారెడ్డితో పాటు చాలామంది బీఆర్ఎస్ నేతలు బుట్టెంగారి తరపున ప్రచారం చేస్తున్నారు.

బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రింకోర్టులో కేసువేసిన బుట్టెంగారి బీఆర్ఎస్ టికెట్ మీద పోటీచేస్తున్నా కాంగ్రెస్ నేతలు పట్టించుకోలేదు. బుట్టెంగారిని అడ్డంపెట్టుకుని కాంగ్రెస్ మీద టన్నులకొద్దీ బురదచల్లేసిన పార్టీ తరపునే ఇపుడు అతగాడు పోటీచేస్తున్నాడని చెప్పాలన్న సోయి కూడా కాంగ్రెస్ నేతల్లో లేదు. ఈ విషయమై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. బీసీల రిజర్వేషన్లు అడ్డుకుంటూ కోర్టులో కేసు వేసిన బుట్టెంగారికి బీఆర్ఎస్ టికెట్ ఎలాగ ఇచ్చిందని మండిపడ్డారు. కవితకు ఉన్న స్పృహ కూడా హస్తంపార్టీకి లేకపోయె.


ఇదేవిషయమై బీసీ జేఏసీ ఛైర్మన్ జాజుల శ్రీనివాసగౌడ్ మాట్లాడుతు బుట్టెంగారికి బీఆర్ఎస్ మద్దతు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మాధవరెడ్డికి ఇచ్చిన బీఫారమ్ ను బీఆర్ఎస్ వెంటనే వెనక్కు తీసుకోవటమే కాకుండా పార్టీనుండి బహిష్కరించాలన్నారు. తన డిమాండ్ మీద బీఆర్ఎస్ 48 గంటల్లో వివరణ ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యాలయాల ముందు నిరసనలు చేస్తామని హెచ్చరించారు


బీసీలకు తాము మద్దతిస్తున్నామని చెప్పి, రేవంతే డబుల్ గేమ్ ఆడుతున్నాడని అప్పట్లో బీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి మీద చేసిన ఆరోపణలను జాజుల గుర్తుచేశారు. బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నామని ఇంతకాలం చెప్పి ఇపుడు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తు కేసు వేసిన బుట్టెంగారిని పార్టీలో చేర్చుకుని టికెట్ ఎలాగ ఇస్తారని బీఆర్ఎస్ నేతలను జాజుల తీవ్రస్ధాయిలో నిలదీశారు. బీఆర్ఎస్ చర్యల వల్ల బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నది బీఆర్ఎస్సే అని అర్ధమవుతోందని జాజుల అన్నారు. జాజుల హెచ్చరికల తర్వాత కూడా కాంగ్రెస్ నేతలు స్పందించకపోవటమే విచిత్రంగా ఉంది.

Read More
Next Story