
రేవంత్ పై హార్వర్డ్ యూనివర్సిటీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ధాటిని బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారు
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ధాటిని బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారు. దాంతో రేవంత్ చరిత్రనంతా తవ్వితీసి ఫిర్యాదులు చేస్తున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీకి బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ చేసిన ఫిర్యాదు ఇందులో భాగంగానే చూడాలి.
బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మీద హార్వర్డ్ యూనివర్సిటీకి శుక్రవారం ఫిర్యాదుచేశారు. ఏమని ఫిర్యాదు చేశారంటే రేవంత్ రెడ్డికి ఇచ్చిన గ్లోబల్ లీడర్ షిప్ సర్టిఫికేట్ ను వెనక్కు తీసుకోవాలని. ఈ విషయాన్ని స్వయంగా ప్రవీణే తన ట్విట్టర్లో ప్రకటించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఎదుర్కొనన్ని 89 క్రిమినల్ కేసులను ఎదుర్కొంటు, ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి దొరికి దాదాపు 50 రోజులు జైలులో గడిపి ఇపుడు సీఎంగా పలు కుంభకోణాలకు పాల్పడుతున్నట్లు ప్రవీణ్ హార్వర్డ్ యూనివర్సిటీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
నేను ఈ రోజు ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన సర్టిఫికేట్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఒక ఈ మెయిల్ పంపించాను.
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) February 5, 2026
దేశంలో ఏ ముఖ్యమంత్రి ఎదుర్కోనన్ని క్రిమినల్ కేసులు (89) ఎదుర్కొంటూ, ఓటు కు నోటు కేసులో రెడ్…
రేవంత్ తెలంగాణ ప్రజల మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాడని, ప్రతి చోటా అభ్యంతరకరమైన భాషను ప్రత్యర్దులపై ప్రయోగిస్తున్నాడని మండిపడ్డారు. ఇలాంటి రాజకీయ నాయకుడు 21వ శతాబ్దానికి పనికిరాడని, ప్రాచీన రాతియుగంలో కూడా నాయకుడు ఉండి ఉండరని తన ఫిర్యాదులో ప్రవీణ్ ప్రస్తావించారు. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న నాయకుడికి హార్వర్డ్ యూనివర్సిటి సర్టిఫికేట్ ఇవ్వటం దేనికి సంకేతం ? అని తన ఫిర్యాదులో ప్రశ్నించారు. హార్వర్డ్ యూనివర్సిటీకి ప్రవీణ్ చేసిన ఫిర్యాదు చాలా సీరియస్ అనే చెప్పాలి.

