
బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏ మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కార్మిక సంఘాల నేతలతో మాట్లాడుతు (Municipal elections)మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓట్లేసి గెలిపించాలని కోరారు
బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పటాన్ చెరు నియోజకవర్గంలో (BRS)బీఆర్ఎస్ తరపున గెలిచిన (Defected MLA Gudem Mahipal Reddy)గూడెం మహిపాల్ రెడ్డి తర్వాత కాంగ్రెస్ లోకి ఫిరాయించిన విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు తన కార్యాలయంలో కార్మిక సంఘాల నేతలతో మాట్లాడుతు (Municipal elections)మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓట్లేసి గెలిపించాలని కోరారు. గూడెం ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఇదే కొత్తకాదు. గతంలో కూడా కార్యకర్తలతో మాట్లాడుతు అనవసరంగా బీఆర్ఎస్ కు దూరమయ్యానని తెగ బాధపడిపోయారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గూడంలో ఏదో అసంతృప్తి ఉన్నట్లు అర్ధమవుతోంది. ఎందుకంటే బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. కాంగ్రెస్ లోకి ఫిరాయించిన తర్వాత బీఆర్ఎస్ కు మద్దతుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ లోకి ఫిరాయించిన తర్వాత బీఆర్ఎస్ కు మద్దతుగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్ధంకావటంలేదు. కాంగ్రెస్ లో ఉంటూ బీఆర్ఎస్ కు మద్దతుగా మాట్లాడుతున్న ఈ ఎంఎల్ఏ అసలు బీఆర్ఎస్ లో నుండి ఎందుకు బయటకు వచ్చేశారు ?
కాంగ్రెస్ పార్టీవర్గాల సమాచారం ఏమిటంటే గూడెం అనుకున్నట్లుగా తనకు ప్రభుత్వంలో పనులు కావటంలేదు. పైగా తన క్వారీలపైన విజిలెన్స్ అధికారుల దాడులు జరగటమే కాకుండా మద్దతుదారులపైన కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలోకి ఫిరాయించిన తర్వాత కూడా పనులు జరగకపోవటమే కాకుండా తమ క్వారీలపైన దాడులు జరగటం, మద్దతుదారులపై కేసులు నమోదవ్వటంతో గూడెంలో తీవ్రమైన అసంతృప్తి పెరిగిపోయినట్లు అర్ధమవుతోంది. ఈమధ్యనే ఎంఎల్ఏ సొదరుడు మధుసూదన్ రెడ్డి కొందరు మద్దతుదారులతో తిరిగి బీఆర్ఎస్ లో చేరారు.
ఈరోజు ఎంఎల్ఏ మాట్లాడుతు నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వం నుండి ఎలాంటి నిదులు మంజూరు కావటంలేదన్నారు. అందుకనే బీఆర్ఎస్ కు ఓట్లేయించాలని, వేయాలని నేతలను గూడెం కోరటం ఇపుడు హాట్ టాపిక్ అయిపోయింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత గూడెం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. చివరకు ఏమిచేస్తారో చూడాలి.

