మున్సిపల్ ఎన్నికల్లో మంత్రులకు కీలక బాధ్యతలు
x

మున్సిపల్ ఎన్నికల్లో మంత్రులకు కీలక బాధ్యతలు

15 నియోజకవర్గాలకు 15 మంది మంత్రులు ఇన్‌ఛార్జ్‌లు


మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ సన్నద్దం అవుతోంది. వీటిలో విజయం సాధించాలని రాజకీయ పార్టీలు కూడా కసరత్తులు చేస్తున్నాయి. ఇప్పటికే రిజర్వేషన్లు కూడా ఖరారు కావడంతో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ వ్యూహాలకు తుదిమెరుగులు దిద్దుతున్నాయి. వీటిలో భాగంగా కాంగ్రెస్ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంత్రులకు కీలక బాధ్యతలు అందించింది. ఒక్కో జిల్లాకు ఒక్కో మంత్రిని ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. కేటాయించిన జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించేలా చూసుకోవడం సదరు మంత్రి బాధ్యత. 15 నియోజకవర్గాలకు 15 మంది మంత్రులు ఇన్‌ఛార్జ్‌లుగా బాధ్యతలు నిర్వహించనున్నారు.

మంత్రులకు అప్పగించిన బాధ్యతలు:

  1. నిజామాబాద్: ఉత్తమ్ కుమార్ రెడ్డి
  2. వరంగల్: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  3. పెద్దపల్లి: జూపల్లి కృష్ణారావు
  4. మహబూబ్‌నగర్: దామోదర రాజనరసింహ
  5. జహీరాబాద్: అజారుద్దీన్
  6. నాగర్‌కర్నూల్: వాకిటి శ్రీహరి
  7. నల్గొండ: అడ్లూరి లక్ష్మణ్ కుమార్
  8. మెదక్: వివేక్ వెంకటస్వామి
  9. ఆదిలాబాద్: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి
  10. మల్కాజిగిరి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  11. చేవెళ్ల: దుద్దిళ్ల శ్రీధర్ బాబు
  12. కరీంనగర్: తుమ్మల నాగేశ్వరరావు
  13. ఖమ్మం: కొండా సురేఖ
  14. మహబూబాబాద్: పొన్నం ప్రభాకర్
  15. భువనగిరి: సీతక్క
Read More
Next Story