మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ దే హవా
x
Exit poll results

మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ దే హవా

పీపుల్స్ పల్స్ అనే ఎన్నకల సర్వే సంస్ధ ప్రకటన ప్రకారం కాంగ్రెస్ కు 68-76 మున్సిపాలిటీలను గెలుచుకోబోతోంది.


హోరాహోరీగా సాగిన మున్సిపల్ ఎన్నికల సమరంలో అధికార కాంగ్రెస్ పార్టీదే పైచేయా ? ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ప్రకారం అవుననే సమాధానం చెప్పుకోవాలి. (Municipal elections)మున్సిపాలిటీల్లో పట్టు నిలుపుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్(BRS) శతవిధాలుగా ప్రయత్నించింది. అధికారంలో ఉండబట్టి మొత్తం మున్సిపాలిటీలను స్వీప్ చేయాలని కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నించింది. ఇక పట్టణ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికలు కాబట్టి గట్టి ప్రభావం చూపాలని బీజేపీ(Telangana BJP) కూడా బాగానే పోరాడింది. అందుకే చాలా మున్సిపాలిటీల్లో త్రిముఖ పోటీ జరిగింది. హోరా హోరీగా సాగిన పోరులో (Telangana Congress)కాంగ్రెస్ మంచి ఫలితాలను రాబట్టినట్లే అనుకోవాలి.

పీపుల్స్ పల్స్ అనే ఎన్నకల సర్వే సంస్ధ ప్రకటన ప్రకారం కాంగ్రెస్ కు 68-76 మున్సిపాలిటీలను గెలుచుకోబోతోంది. ఇక బీఆర్ఎస్ 29-36 మున్సిపాలిటీలను, బీజేపీ మ్యాగ్జిమమ్ 5 చోట్ల గెలుచుకోబోతోందని జోస్యం చెప్పింది. ఏఐఎంఐఎం కూడా ఒక మున్సిపాలిటీలో గెలిచే అవకాశముందని చెప్పింది. ఆశ్చర్యం ఏమిటంటే ఇతరులు అంటే చిన్నా చితకా పార్టీలు సుమారు 8-14 మున్సిపాలిటీల్లో పాగా వేసే అవకాశాలున్నాయని తేలింది.

68-76 మున్సిపాలిటీలు గెలుచుకుని మంచి ఫలితాలను రాబడుతోందని ఎందుకు అన్నట్లు ? ఎందుకంటే 2020లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 576 వార్డులు/డివిజన్లలో మాత్రమే గెలిచింది. బీఆర్ఎస్ 1704 వార్డులు/డివిజన్లను గెలిచింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదేపదే చెప్పుకున్నట్లుగా 2020 ఎన్నికల్లో 120 మున్సిపాలిటీల్లో 117 మున్సిపాలిటీలను గెలుచుకుంది. అప్పటి లెక్కను చూసుకుంటే ఇపుడు కాంగ్రెస్ మంచి స్కోరును సాధించినట్లుగానే చెప్పుకోవాలి. ఇపుడు ఎన్నికలు జరిగిన 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లో 76 మున్సిపాలిటీలను, ఐదు కార్పొరేషన్లలో జెండా ఎగరేస్తుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ లో తేలింది.

ఇక బీఆర్ఎస్ విషయం చూస్తే 29-36 మున్సిపాలిటీల్లో గెలుస్తుందని తేలింది. ఇదే నిజమైతే కేటీఆర్ జోస్యం తప్పని అర్ధమవుతోంది. జోస్యం ఏమిటంటే జనాలంతా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారని, మున్సిపల్ ఎన్నికల్లో కారుపార్టీని గెలిపించేందుకు జనాలు సిద్దంగా ఉన్నారని ప్రతిరోజు ఊదరగొట్టారు. తాజా ఎగ్జిట్ పోల్ తో కేటీఆర్ చెప్పింది వాళ్ళ నేతలు, క్యాడర్ ను ఉత్తేజపరచటానికి మాత్రమే అని అర్దమవుతోంది.

ఫైనల్ గా బీజేపీ విషయం చూస్త అదిచేస్తాం..ఇదిచేస్తాం అని నానా గోలచేసిన కమలంపార్టీ నేతలు చివరకు మహాయితే 5 మున్సిపాలిటీలను గెలుచుకోవచ్చని మాత్రమే తేలింది. ఇదికూడా అనుమానంగానే ఉంది. ఎందుకంటే బొటాబొటిగా గెలిస్తే మాత్రం అంతా చివరకు కాంగ్సెస్ లోకి జంప్ చేసే అవకాశాలను కొట్టిపారేసేందుకులేదు. 13వ తేదీన జరగబోయే కౌంటింగులో అసలైన ఫలితాలు ఎలాగుండబోతున్నాయో తేలిపోతుంది.

Read More
Next Story