
Breaking News : విమాన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం
బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ మరణించారు
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించారు. బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ మరణించారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. ఆయనతో పాటు ప్రయాణిస్తున్న మరో ఆరుగురు కూడా మరణించారు. బుధవారం ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో బారమతికి దగ్గరలోని ఒక గ్రామంలో విమానం కూలిపోయింది. బారామతిలో విమానం దిగేటపుడు తలెత్తిన సాంకేతిక లోపాలతో విమానం ఒక్కాసారిగా కూలిపోయింది. ఈవిమానంలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రితో పాటు మరో ఆరుగురు పార్టీ సీనియర్ నేతలున్నారు. ముంబాయ్ నుండి బారామతికి చేరుకుని అజిత్ పవార్ స్థానిక సంస్థల ఎన్నికల బహిరంగసభలో పాల్గొనాల్సుంది. అందుకనే ముంబాయ్ లో తన మద్దతుదారులతో కలిసి బారామతికి బయలుదేరారు.
బారామతి సమీపంలోని ఒక కుగ్రామంలో విమానం కూలిపోవటంతో పెద్ద పేలుడు జరిగింది. పేలుడుకు సమీపంలోనే ఉన్న గ్రామస్తులు ఘటన జరిగిన ప్రాంతానికి పరిగెత్తుకుని వచ్చారు. విషయం చూసి వెంటనే గ్రామస్తులే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే అధికార యంత్రాంగం రంగంలోకి దిగారు. ప్రమాదస్ధలానికి చేరుకున్న యంత్రాంగం బాధితులను ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. అయితే అప్పటికే ఆరుగురు పేలుడుకారణంగా మరణించినట్లు ప్రాధమికంగా నిర్దారించారు. మిగిలిన విషయాలు ఇంకా తెలియాల్సుంది.
అజిత్ పవార్ ఎవరు?
అజిత్ పవార్ జూలై 22, 1959న మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని డియోలాలి ప్రవర అనే గ్రామంలో జన్మించారు. అజిత్ పవార్ తండ్రి అనంతరావు పవార్ ముంబై (అప్పటి బొంబాయి) లోని ప్రఖ్యాత రాజ్‌కమల్ స్టూడియోస్‌లో పనిచేసేవారు. తండ్రి మరణం తరువాత అతని విద్యాభ్యాసం ఆగిపోయింది. మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ నుండి సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (SSC) స్థాయి వరకు ఆయన తన అధికారిక విద్యను పూర్తి చేశారు. ఆయన తండ్రి అకాల మరణంతో, కుటుంబాన్ని పోషించడానికి చిన్న వయసులోనే అజిత్ పవార్ ఉద్యోగం ప్రారంభించాల్సి వచ్చింది.
ఎప్పుడూ అధికారం నుండి దూరంగా ఉండని వ్యక్తిగా ఆయన పేరుంది. 2019లో బిజెపి నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన మళ్ల డిప్యూటీ సిఎంగా పనిచేశారు. మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. తర్వాత BJPతో చేతులు కలిపారు. అపుడు ఏర్పడిన
రాజకీయ జీవితంలో ఎక్కువ భాగం తన బాబాయ్ శరద్ పవార్ నీడలో గడిపినా స్వతంత్రంగాఎదిగేందుకు ప్రయత్నించారు. మహారాష్ట్ర రాజకీయాలలో వచ్చిన అనిశ్చితి ఆయన బాగా కలిసొచ్చింది. 2023 రాష్ట్ర ఎన్నికల్లో, మహాయుతి కూటమి అఖండ మెజారిటీని సాధించినపుడు అజిత్ పవార్ నేతృత్వంలోని NCP 41 సీట్లు గెలుచుకుంది. దానితో ఎన్ సిపి నాయకత్వం మీద తిరుగు బాటు చేసి పార్టీ చీల్చి సాతంత్య్రం ప్రకటించుకున్నారు.

