మాజీ మావోయిస్టు నేత దేవ్ జీ ఎక్కడినుండి పోటీచేస్తారో తెలుసా ?
x
Surrendered Maoist leader Devuji

మాజీ మావోయిస్టు నేత దేవ్ జీ ఎక్కడినుండి పోటీచేస్తారో తెలుసా ?

దేవ్ జీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గంలో పోటీచేసే అవకాశం ఉందని చెప్పారు


లొంగిపోయిన మావోయిస్టుపార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని దేవ్ జీ నే స్వయంగా వెల్లడించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల నియోజకవర్గంలోనే పోటీచేయబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని దేవ్ జీ నో లేకపోతే మాజీ మావోయిస్టులో చెప్పలేదు కాని సీనియర్ నేత, మాజీ ఎంఎల్ఏ గోనె ప్రకాష్ రావు బయటపెట్టారు. రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్న దేవ్ జీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గంలో పోటీచేసే అవకాశం ఉందని చెప్పారు. గోనెకు అన్నీ రాజకీయపార్టీలతోను విస్తృతమైన సంబంధాలున్నాయి.

మిగిలిన నేతల్లాగ మీడియా కనబడగానే ఏదో ఒకటి నోటికి పనిచెప్పాలి అనుకునే రకంకాదు. అలాగే నిత్యం మీడియాలో ప్రచారంలో ఉండాలని కోరుకునే రకం కూడా కాదు. అందుకనే మీడియా కూడా గోనె చెప్పే విషయాలకు ప్రాధాన్యత ఇస్తుంది. అందుకనే ఇపుడు దేవ్ జీ రాజకీయ ప్రవేశం, పోటీ విషయంలో గోనె చెప్పిన మాటలకు ప్రాధాన్యత ఏర్పడింది. మావోయిస్టు అగ్రనేత ముప్పాళ లక్ష్మణరావు అలియాస్ గణపతి పోలీసులకు లొంగిపోవాలని గోనె కూడా విజ్ఞప్తిచేశారు. గణపతి ఆరోగ్యం సరిగాలేని కారణంగా ప్రభుత్వం కూడా గణపతి ప్రాణాలకు భరోసా ఇస్తోంది కాబట్టి వెంటనే లొంగిపోవాలన్నారు.

గణపతి కొడుకు ముప్పాళ వాసుదేవరావు తండ్రిని ఉద్దేశించి చెప్పిన వాయిజ్ మెసేజ్ ను అనుమతి లేకుండా మీడియాకు షేర్ చేసినందుకు క్షమాపణలు కోరారు. తుపాకులను వదిలేసి గణపతి ప్రజాజీవితంలోకి రావాలన్నారు. గణపతి ప్రజల్లోకి వచ్చి సేవచేయాలని కోరారు. తాను కూడా గణపతితో కలిసి పనిచేస్తానని గోనె ప్రతిపాదించారు. దేవ్ జీ, మల్లా రాజిరెడ్డిని పోలీసులు అనుకుంటే ఎన్ కౌంటర్లు చేసేయచ్చని కాని అలా చేయకుండా వారిని సమాజంలోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. సీతక్క కూడా మావోయిస్టుగా పనిచేసి లొంగిపోయి ప్రజాజీవితంలోకి వచ్చి ఇపుడు మంత్రి అయిన విషయాన్ని గోనె గుర్తుచేశారు.

Read More
Next Story