x

ఓట్ల విషయంలో ఎన్నికల కమిషన్ ద్వంద్వ విధానం

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఓట్లు గల్లంతయ్యాయని చెప్పింది, గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా నమోదుచేసుకోమని కోరిన ఎన్నికల కమిషన్ ఒకటే.


ఓట్ల విషయంలో ఎన్నికల కమిషన్ అనుసరిస్తున్న విధానమే విచిత్రంగా ఉంది. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓట్లు గల్లంతైన వాళ్ళు కూడా తొందరలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికల్లో ఓటు వేయటానికి అవకాశం ఉండటం కమిషన్ ద్వంద్వ విధానానికి నిదర్శనంగా నిలుస్తోంది. రాష్ట్రంలో గల్లంతైన సుమారు 50 లక్షల ఓట్లలో ఎవరైనా డిగ్రీ హోల్డర్లుంటే వాళ్ళు మాత్రం తొందరలో జరగబోయే రెండు గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికల్లో ఓట్లు వేయచ్చు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, నల్గొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. పై ఆరు జిల్లాల్లోని డిగ్రీ హోల్డర్లను ఓటర్లుగా నమోదుచేసుకోమని ఎన్నికల కమిషన్ సెప్టెంబర్ 28వ తేదీన నోటీఫికేషన్ జారీచేసింది. అక్టోబర్ 7వ తేదీతో దరఖాస్తు గడువు ముగిసింది. ఫైనల్ ఓటర్ల జాబితాను కమిషన్ నవంబర్లో ప్రకటించబోతోంది.

గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికల్లో ఓట్లేయాలి అనుకున్న వాళ్ళు ఫారం 18 నింపి దరఖాస్తు చేసుకున్నారు. ఓటర్లుగా నమోదుకోరుతు ఎంతమంది ఫారం 18ద్వారా దరఖాస్తు చేసుకున్నారన్న విషయాన్ని కమిషన్ ప్రకటించలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓట్లు కోల్పోయిన వారిలో ఎక్కువమంది హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే ఉన్నారు.

అలా ఓట్లుకోల్పోయిన వారిలో ఎవరైనా డిగ్రీ హోల్డర్లుండి, ఓట్లేయాలనే ఆసక్తి ఉంటే అలాంటి వారంతా ఫారం 18 ద్వారా దరఖాస్తు చేసుకుని ఉంటే వారికి ఓటేసే అవకాశం దొరుకుతుంది. ఇక్కడే కమిషన్ ద్వంద్వ విధానం బయటపడుతోంది. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓట్లు గల్లంతైన వారు గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికల్లో ఫారం 18 ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఓటు వేయటానికి అవకాశం ఎలాగ దొరుకుతుంది అన్నదే అర్ధంకావటంలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఓట్లు గల్లంతయ్యాయని చెప్పింది, గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా నమోదుచేసుకోమని కోరిన ఎన్నికల కమిషన్ ఒకటే.

అలాగే ఎస్ఐఆర్ లో ఓటు గల్లంతైన వ్యక్తి, ఎంఎల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అర్హత సాధించిన వ్యక్తి కూడా ఒకరే. ఎస్ఐఆర్ లో సదరు వ్యక్తి ఓటు గల్లంతవ్వటం ఏమిటి ? ఎంఎల్సీ ఎన్నికల్లో ఓటుకు అర్హత సాధించటం ఏమిటన్నదే ఎవరికీ అర్ధం కావటంలేదు

Read More
Next Story