
‘‘ప్రమాణ స్వీకారం సంగతి సునేత్రా పవార్ కూడా చెప్పలేదు’’
శివసేన (ఉద్దవ్) వర్గం ఆరోపణలు, సామ్నాలో ప్రత్యేక సంపాదకీయం
మహారాష్ట్ర కొత్త డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్ ప్రమాణ స్వీకారం బీజేపీ ఉందని శివసేన(యూబీటీ వర్గం) తన అధికార పత్రిక సామ్నాలో ఆరోపించింది. బీజేపీ ఆదేశం మేరకే ఆమె రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించారని పేర్కొంది. ప్రమాణ స్వీకారం గురించి కూడా ముందస్తు సమాచారం సునేత్రా పవార్ ఇవ్వలేదని తెలిపింది. అజిత్ పవార్ మరణించిన కొన్ని రోజుల్లోనే ఈ చర్య జరిగిందని ఇది బీజేపీకి అనుకూలంగా నడిచిన రాజకీయంగా విమర్శించింది.
అజిత్ పవార్, శరద్ పవార్ నేతృత్వంలోని రెండు ఎన్‌సిపి వర్గాల ఏకీకరణకు సంబంధించి, బిజెపి నాయకత్వం, ఎన్‌సిపి నాయకులు అయిన సునీల్ తత్కరే, ప్రఫుల్ పటేల్ విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారని సంపాదకీయం పేర్కొంది.
'ఫడ్నవీస్ నియంత్రణలో' ఎన్సీపీ వర్గం
సునేత్రా పవార్‌ను ఉప ముఖ్యమంత్రిగా నియమించారని, అయితే స్విచ్ మాత్రం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వద్ద ఉన్నాయని కూడా ఆరోపించింది. సునేత్రా పవార్, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన రెండూ ఫడ్నవీస్ దయతోనే తమ రాజకీయాలు నడుపుతున్నారని కూడా ఎగతాళి చేసింది. పరోక్షంగా వారికి ఉక్రోశం కలిగేలా పార్టీ సామ్నా సంపాదకీయం అచ్చేవేసింది.
2029 అసెంబ్లీ ఎన్నికల్లో BJP ఖచ్చితంగా స్వతంత్రంగా పోటీ చేస్తుందని, శివసేన, NCP నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు కాషాయ పార్టీలో చేరుతారని సంపాదకీయం పేర్కొంది.
పూణే జిల్లాలోని బారామతి వద్ద జరిగిన విమాన ప్రమాదంలో NCP నాయకుడు అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు మరణించిన సంగతి తెలిసిందే. మూడు రోజుల తర్వాత, శనివారం రాష్ట్ర తొలి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్ ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ పరిణామంపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. 'సునేత్రా గుంగి గుడియా కాకూడదు'(మాటలు రాని బొమ్మ) కాకపోవచ్చని, సమర్థవంతంగా పనిచేస్తుందని కూడా అంచనావేసింది. అయితే హిందూ సంప్రదాయం ప్రకారం కర్మకాండలు పూర్తికాకముందే ఎలా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా సంపాదకీయం ఆక్షేపించింది.
పవార్ కుటుంబానికి తెలియదు
సునేత్రా పవర్ ప్రమాణ స్వీకారం గురించి ఎన్సీపీ చీలిక వర్గం నాయకుడైన శరద్ పవార్ కు గానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన సుప్రియా సూలేకు గాని తెలియదని పేర్కొంది. సునేత్రా కోరిక మేరకు ప్రమాణ స్వీకారం జరిగిందని బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని ఖండించింది. ప్రమాణ స్వీకారానికి బారామతి నుంచి ముంబైకి బయలుదేరుతున్నట్లు సునేత్రా పవార్ కనీస సూచన కూడా ఇవ్వలేదని అది పేర్కొంది.
ఈ రాజకీయాల వెనుక బిజెపి నాయకులే "సూత్రధారి" అని ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (UBT) పేర్కొంది. "అజిత్ పవార్ మరణం తర్వాత పవార్ కుటుంబంలో మహారాష్ట్ర రాజకీయాల్లో చిక్కులు పెరిగాయి. ఈ సమస్యలు పరిష్కారం కాకూడదని చాలామంది కోరుకుంటున్నారు" అని సంపాదకీయం పేర్కొంది.
'ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు
అజిత్ పవార్ మరణం తర్వాత, NCPలో అశాంతి నెలకొందని, కొంతమంది నాయకులు మరింత ప్రతిష్టాత్మకంగా మారారని, పార్టీలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టే పోటీ ఉందని సంపాదకీయం పేర్కొంది. పటేల్, తత్కరే మధ్య విభేదాలు ఉన్నాయి.
"పాటిల్-పవార్" పార్టీ పటేల్ వద్దకు వెళ్లకూడదనే కారణంగా సునేత్రా పవార్‌ను డిప్యూటీ సీఎంగా చేశారని NCP వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్‌ను ప్రస్తావిస్తూ అది పేర్కొంది.
Next Story

