వికారాబాద్ చైర్‌పర్సన్‌గా గడ్డం అనన్య ఏకగ్రీవం
x

వికారాబాద్ చైర్‌పర్సన్‌గా గడ్డం అనన్య ఏకగ్రీవం

ఏకైక నామినేషన్‌తో గడ్డం అనన్య ఎన్నిక. వైస్ చైర్మన్‌గా అర్ధ సుధాకర్ రెడ్డి. 34 కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం పూర్తి.


వికారాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా గడ్డం అనన్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు స్వీకరించారు. 17వ వార్డు కౌన్సిలర్‌గా ఉన్న ఆమె, వికారాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కుమార్తె కావడం ప్రత్యేకతగా నిలిచింది. మొదటగా నూతనంగా ఎన్నికైన 34 మంది వార్డు కౌన్సిలర్లతో ఇంచార్జి ఎన్నికల అధికారి, జిల్లా అదనపు కలెక్టర్ సుదీర్ ప్రమాణ స్వీకారం చేయించారు.

అనంతరం చైర్‌పర్సన్ పదవికి నామినేషన్లు స్వీకరించారు. 17వ వార్డు కౌన్సిలర్ గడ్డం అనన్య ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. తర్వాత ఎన్నికల అధికారి సుదీర్ ఆమెతో చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు.

పదవీ స్వీకారం అనంతరం గడ్డం అనన్య తన తల్లి స్వర్గీయ గడ్డం శైలజ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం భావోద్వేగ వాతావరణంలో జరిగింది. అనంతరం వైస్ చైర్మన్‌గా 10వ వార్డు కౌన్సిలర్ అర్ధ సుధాకర్ రెడ్డిని కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. వికారాబాద్ మున్సిపాలిటీలో కొత్త బృందం బాధ్యతలు స్వీకరించడంతో తదుపరి కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించనున్నారు.

Read More
Next Story