సిట్ విచారణకు కేటీఆర్, జూబ్లీహిల్స్‌లో హైటెన్షన్
x

సిట్ విచారణకు కేటీఆర్, జూబ్లీహిల్స్‌లో హైటెన్షన్

కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో SIT విచారణకు హాజరయ్యారు. తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన, హరీశ్ రావు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.


ఫోన్ ట్యాపింగ్ కేసులో SIT విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. నోటీసుల ప్రకారం శుక్రవారం ఉదయం 11 గంటల సమయానికి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేసన్ దగ్గరకు కేటీఆర్ చేరుకున్నారు. కేటీఆర్ విచరణ నేపథ్యంలో స్టేషన్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా ఈక్రమంలోనే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అక్కడకు చేరుకున్నారు.

కేటీఆర్ విచారణకు వ్యతిరేకంగా వాళ్లు నినాదాలు చేశారు. దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం అంటూ ఆందోళన బాట పట్టారు. విచారణ ఉన్న నేపథ్యంలో పోలీసులు వాళ్లని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగానే పోలీసులకు మాజీ మంత్రి హరీష్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏ ఒక్కరినీ వదలమన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ దగ్గర తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు, తెలంగాణ భవన్ గేటును మూసివేయాలని ప్రయత్నించడంతో నిరసన మరింత ఉత్కంఠగా మారింది.

నేను కొన్ని ప్రశ్నలు అడగాలి: కేటీఆర్

ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన విచారణపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నోటీసులు ఇచ్చారని, చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా తాను విచారణకు హాజరవుతానని అన్నారు. ఈ సందర్భంగానే "నేను విచారణకు హాజరైనప్పటికీ, నాకు కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను" అన్నారు.

"మీడియా లీకులే తప్ప, సాక్ష్యంగా ఎటువంటి ఆధారం లేదు. ఎందుకు ఇంత దుష్ప్రచారం?" అని ప్రశ్నించారు. "లీకుల పేరుతో డ్రామాలు చేస్తున్నారు, వారిని వదిలిపెట్టను" అని కేటీఆర్ స్పష్టం చేశారు.అయితే తాము తప్పు చేయలేదు కాబట్టే తామెవరూ భయపడటం లేదని కేటీఆర్ అన్నారు. "మహిళల ఆత్మాభిమానం దెబ్బతీసినప్పుడు కూడా, కేటీఆర్ గారు ప్రతిరోజు సమాధానం ఇచ్చారు" అని చెప్పారు.

ఏ పోలీసును వదిలిపెట్టం: హరీష్

కేటీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు, పోలీసుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై హరీశ్ రావు స్పందించారు. పోలీసులు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారని అన్నారు ఏ ఒక్కరినీ వదలమని హెచ్చరించారు. "రిటైర్మెంట్ అయినా, ఈ అధికారులను వదిలిపెట్టను" అని అన్నారు. "పోలీసులు, అధికారులు చట్టం అతిక్రమించి, మా నాయకులపై ప్రయోగాలు చేస్తున్నారు" అని ఆయన ఆరోపించారు. "రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, మీ సొంత డబ్బుతో కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది" అని హెచ్చరించారు.

బీఆర్ఎస్ నేతలను భయపెట్టాలనే కుట్రలు

హరీశ్ రావు మాట్లాడుతూ, "రేవంత్ రెడ్డి ఇచ్చే డైరెక్షన్లను మేము అంగీకరించేది కాదు. "చట్టం ప్రకారం" వ్యవహరించండి" అని సూచించారు. ఆయన "కుట్రలతో బీఆర్ఎస్ నేతలను బెదిరించాలని ప్రయత్నిస్తున్నారని’’ ఆరోపించారు. "తప్పుడు సూచనలు, చట్టం అతిక్రమిస్తే ఆ పోలీసులపై చర్యలు తీసుకోవడం ఖాయం" అని హరీష్ రావు వార్నింగ్ ఇచ్చారు.

"రెపింక్ పెడితే... జాగ్రత్తగా ఆలోచించండి" అని స్పష్టం చేశారు. ‘‘కేటీఆర్ మీద సోషల్ మీడియాలో, టీవీల్లో, పత్రికల్లో వార్తలు రాయిస్తే ఏం చేశారు? రేవంత్ రెడ్డి మీద కూడా అధికారులు విచారణ జరిపించాలి.. అన్ని విషయాలు బయటకు రావాలి’’ అని డిమాండ్ చేశారు.

Read More
Next Story