ట్యాపింగ్ ను కేటీఆర్ అంగీకరించినట్లేనా ?
x
KTR on Telephone Tapping

ట్యాపింగ్ ను కేటీఆర్ అంగీకరించినట్లేనా ?

ప్రతి ప్రభుత్వంలోను (Telephone Tapping)ట్యాపింగ్ జరగటం మామూలే అన్నారు


టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది కాని...తమకు సంబంధంలేదు...ఇది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొదలుపెట్టిన విచిత్రమైన వాదన. శుక్రవారం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(SIT) ముందు జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లో ఉదయం 11 గంటలకు విచారణకు హాజరయ్యారు. దానికిముందు మీడియాతో మాట్లాడుతు ప్రతి ప్రభుత్వంలోను (Telephone Tapping)ట్యాపింగ్ జరగటం మామూలే అన్నారు. అంటే తమ హయాంలో కూడా టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అని అంగీకరించినట్లే. అందుకనే ట్యాపింగ్ ఆరోపణలనుండి తప్పించుకునేందుకు (KTR)కేటీఆర్ బుకాయింపుకు దిగారు. తమ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా, ఇప్పటి డీజీపీ బీ శివధర్ రెడ్డి కూడా పనిచేశారు కాబట్టి ఆయనను కూడా విచారించాలనే విచిత్రమైన డిమాండ్ చేశారు.

ట్యాపింగ్ అన్నది ప్రభుత్వాలతో సంబందంలేకుండా జరిగే నిరంతర ప్రక్రియ అన్నది అందరికీ తెలిసిందే. అయితే అన్నీ ప్రభుత్వాలు ట్యాపింగ్ ను యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద ప్రయోగిస్తే బీఆర్ఎస్ హయాంలో మాత్రమే తమకు ఇబ్బందులు వస్తాయని అనుకున్న వారందరినీ యాంటీ సోషల్ ఎలిమెంట్లుగా ముద్రవేసి వాళ్ళ ఫోన్లను ట్యాపింగ్ చేశాయి. తాము ఎవరి ఫోన్ ను అయితే ట్యాప్ చేయాలని అనుకున్నారో వాళ్ళపైన మావోయిస్టులు లేదా మావోయిస్టు సానుభూతిపరులు అనే ముద్రవేసి ట్యాపింగ్ చేయించేశారు. ఇదే అసలైన పాయింట్.

వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టులు, సెలబ్రిటీలు, రాజకీయ ప్రత్యర్ధులు, పార్టీలోని అనుమానిత నేతలు, జడ్జీలు చివరకు జడ్జీల కుటుంబసభ్యుల ఫోన్లను కూడా కేసీఆర్ ప్రభుత్వం వదిలిపెట్టకుండా ట్యాపింగ్ చేసింది. అందుకనే కొన్ని వేలఫోన్లను స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ట్యాపింగ్ చేయించింది. కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అన్నీ వ్యవహరాల్లోను కొడుకుగా, మంత్రిగా కేటీఆర్ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. అందుకనే సిట్ అధికారులు ఇపుడు కేటీఆర్ ను విచారిస్తున్నది.

సిల్లీ వాదన

కేటీఆర్ విచిత్రమైన వాదన ఎంతసిల్లీగా ఉందంటే ట్యాపింగ్ బాధ్యత పోలీసు శాఖదే కాని ప్రభుత్వానికి కాదట. పోలీసులు ట్యాపింగ్ చేస్తే దానికి ప్రభుత్వానిది బాధ్యత ఎలాగవుతుంది ? తనకేమిటి సంబంధం అని లాజిక్ లేని దబాయింపుకు దిగారు. అప్పటికి పోలీసుశాఖకు ప్రభుత్వానికి సంబంధంలేదన్నట్లుగా కేటీఆర్ మాట్లాడుతున్నారు. అదే నిజమైతే ఇపుడు పోలీసుశాఖ చేస్తున్న తప్పులకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కేటీఆర్ ఎందుకు తప్పుపడుతున్నట్లు ? పోలీసుశాఖ కూడా ప్రభుత్వంలో భాగమే అని తొమ్మిదిన్నరేళ్ళు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కు తెలీదా ? పోలీసుశాఖకు ప్రభుత్వానికి సంబంధంలేదంటే ఆ శాఖేమన్నా అంతరిక్షంలో నుండి పనిచేస్తోందా ?

పోలీసుశాఖలో లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి పరిధిలోనే పనిచేస్తుంది. అలాగే ఇంటెలిజెన్స్ శాఖను ముఖ్యమంత్రే నేరుగా పర్యవేక్షిస్తారని అందరికీ తెలుసు. అదేపద్దతిలో ఇంటెలిజెన్స్ చీఫ్ ముఖ్యమంత్రిగా పనిచేసినపుడు కేసీఆర్ కే రిపోర్టు చేసేవారు. కేసీఆర్ అందుబాటులో ఉండేవారు కాదు కాబట్టి, మంత్రిగాను, కాబోయే ముఖ్యమంత్రిగా బాగా ప్రొజెక్టయిన కారణంగా అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ కేటీఆర్ కే రిపోర్టు చేశారేమో. సినీ సెలబ్రిటీలు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టులు, రాజకీయ ప్రత్యర్ధులు, జడ్జీలతో పాటు వాళ్ళ కుటుంబసభ్యులందరు కేసీఆర్, కేటీఆర్ కు సంఘ విద్రోహశక్తులుగా కనబడ్డారా ? అందుకనే వేలాది ఫోన్ల ట్యాపింగ్ జరిగింది ?

ట్యాపింగ్ లేదు ఏమీలేదని కేటీఆర్ బుకాయించటం చెల్లదు. ఎందుకంటే తనతో పాటు తన భర్త ద్యావనపల్లి అనీల్ కుమార్ ఫోన్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేయించిందని స్వయంగా కల్వకుంట్ల కవితే ఆరోపించారు. ట్యాపింగ్ లో సాక్ష్యాలు బయటపడుతు, తమకు ఇబ్బందులు మొదలవ్వగానే ట్యాపింగ్ పేరుతో తమను రేవంత్ ప్రభుత్వం వేధిస్తోందని గోల చేసినంత మాత్రాన ఎలాంటి ఉపయోగం ఉండదు.

పోలీసుల మీద ఆగ్రహం

తమపైన నమోదైన కేసులు, విచారణలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కేటీఆర్, హరీష్ తో పాటు ఇతర నేతలు పోలీసులపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే సప్తసముద్రాల అవతల దాక్కున్నా వదిలిపెట్టేది లేదని పదేపదే బెదిరిస్తున్నారు. రేవంత్ దృష్టిలో పడేందుకు కొందరు అధికారులు చేస్తున్న ఓవర్ యాక్షన్ కు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించక తప్పదనే విచిత్రమైన వార్నింగులిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయి బీఆర్ఎస్ నేతలను ట్యాపింగ్ కేసులో వేధిస్తున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి.

Read More
Next Story