ఓ పన్నీర్ సెల్వం రాజకీయ ప్రయాణం ముగిసిందా?
x
ఓ. పన్నీర్ సెల్వం

ఓ పన్నీర్ సెల్వం రాజకీయ ప్రయాణం ముగిసిందా?

స్వీయ తప్పిదాలతో క్రమంగా మసకబారిన ఓపీఎస్


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జే. జయలలిత నమ్మినబంటూ ఒకప్పుడూ ఓపీఎస్ గా ప్రసిద్ది చెందిన ఓ పన్నీర్ సెల్వం తన రాజకీయ ప్రయాణంలో క్రమంగా ప్రభావం కోల్పోతున్నాడు.

ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఆయన మద్దతుదారులు దూరంగా జరగడమో లేక నిశ్శబ్ధాన్ని ఆశ్రయించడమే జరుగుతోంది. చాలామంది నాయకులు డీఎంకే తో పాటు ఇతర పార్టీలలో చేరుతున్నారు.

అన్నాడీఎంకేలోకి రావడానికి పళనిస్వామి అన్నిదారులు మూసేయడంతో ఆయన ఇప్పుడు ఎన్డీఏ కూటమిలోకి రావడానికి మాత్రం దారి ఉంది.

జనవరి 27న మధురై లో జరిగిన విలేకరుల సమావేశంలో టీటీవీ దినకరన్ మాట్లాడుతూ.. ఓపీఎస్ కోసం ఎన్డీఏ ప్రయత్నించిందని, అందుకే తాను మధ్యవర్తిగా ప్రయత్నించానని చెప్పారు.
‘‘ఓపీఎస్ ఒక సీనియర్ నాయకుడు. నాకు ఇక్కడ అధికారం లేదు. నేనే దూతగా వ్యవహరించాను. అమ్మపాలన తిరిగి తీసుకువచ్చే కూటమిలో భాగం కావాలని నేను అతనికి చెప్పాను. అతను ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి’’ అని టీటీవీ దినకరన్ విలేకరులతో అన్నారు.
అన్నాడీఎంకే కెరీర్..
1973 లో ఓపీఎస్ అన్నాడీఎంకేలో చేరారు. తేవర్ సమాజం నుంచి వచ్చిన మద్దతుతో బలమైన కెరీర్ ను నిర్మించుకున్నారు. తేనీ జిల్లాలో బోడినాయకనూర్ నుంచి మూడుసార్లు, పెరియకుళం నుంచి రెండు సార్లు ఎన్నికయ్యారు.
2021 రాష్ట్ర ఎన్నికల్లో ఓపీఎస్ బోడినాయకనూర్ కైవసం చేసుకోగలిగారు. కానీ ఓట్ల శాతం మాత్రం తగ్గింది. డీఎంకే అభ్యర్థి తంగ తమిళ్ సెల్వన్ మీద ఏడువేల ఓట్ల తేడాతో గెలిచారు.
2 లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో ఇది చాలా చిన్న విజయం. జయలలిత కాలంలో ఆయన ప్రభావం బాగా ఉండేది. తరువాత క్రమక్రమంగా తగ్గిపోయింది. 2001, 2006, 2011 లో దాదాపు 15 శాతం ఓట్ల తేడాతో గెలిచారు.
జయలలిత..
2016 లో జయలలిత మరణించిన తరువాత ఓపీఎస్ దశ తగ్గడం ప్రారంభమైంది. ఆయన రెండు నెలల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2017 నుంచి 2021 వరకూ పళని స్వామి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఓపీఎస్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ వ్యూహాత్మక తప్పిదాల కారణంగా ఆయన మెల్లగా లైమ్ లైట్ నుంచి తప్పుకున్నారు.
2017 ప్రారంభంలో తన ప్రాబల్యాన్ని పునరుద్దరించడానికి అతను ప్రయత్నించినప్పటికీ అవి ఫలితాలు ఇవ్వలేదు. అన్నాడీఎంకేను ఏకం చేస్తానని చెప్పినప్పటికీ ఆయనకు ప్రజాదరణ దక్కలేదు.
ఓపీఎస్ సన్నిహితులలో ఒకరైన వైతిలింగం ఇప్పుడు డీఎంకేలో చేరారు. మనోజ్ పాండియన్, జేసీడీ ప్రభాకర్ ఇతర పార్టీలలో చేరగా, పెరంబలూర్ కు చెందిన కున్నం ఆర్ఠి రామచంద్రన్ రాజకీయాలకు బైబై చెప్పారు.
నాయకత్వ లోపాలు..
పార్టీ ఫిరాయించిన ఒక మాజీ అన్నాడీఎంకే ఎమ్మెల్యే ‘ది ఫెడరల్’ తో మాట్లాడారు. ఓపీఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం ఆయన మద్దతుదారులందరిని కుంగదీసిందని అన్నారు. ‘‘పన్నీర్ సెల్వం ఇంకా గందరగోళంలోనే ఉన్నాడు’’ అయినప్పటికీ తను నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
రాజకీయ విశ్లేషకుడు ఆర్. భగవాన్ మాట్లాడుతూ.. ఓపీఎస్ ప్రత్యర్థుల చేతిలో ఓడిపోలేదు. తన సొంత నాయకత్వ నిర్ణయం లోపం ఇలా జరిగిందని అన్నారు. అదే సమయంలో ఈపీఎస్, అన్నాడీఎంకే వ్యవస్థాగత నిర్మాణాన్ని చెక్కుచెదరకుండా ఉంచగలిగారు.
మధురై విలేకరులు ఓపీఎస్, ఎన్డీఏలో చేరతారా అని ప్రశ్నించగా, ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ‘‘నా ఏకైక డిమాండ్ ఏంటంటే.. అన్నాడీఎంకేలోని అన్ని వర్గాలు ఏకం అవ్వాలి. నేను కూటమిలో చేరాలా వద్దా అనేది దేవుడు నిర్ణయిస్తాడు’’ అని ఆయన అన్నారు.
Read More
Next Story