పుట్టాకు బెయిల్, డ్రగ్స్ కేసు వీకైపోయినట్లేనా?
x
TDP MP Putta Mahesh Yadav

పుట్టాకు బెయిల్, డ్రగ్స్ కేసు వీకైపోయినట్లేనా?

శనివారం రాత్రెప్పుడో చేసిన బ్లడ్ టెస్టుల్లో ఆరుగురికి పాజిటివ్ వస్తే వెంటనే మెజిస్ట్రేట్ ముందు ఎందుకు హాజరుపరచలేదు ?


డ్రగ్స్ కేసు వ్యవహారం చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో శనివారం డ్రగ్స్ తీసుకుంటు బీఆర్ఎస్ మాజీ ఎంఎల్ఏ పైలెట్ రోహిత్ రెడ్డి తదితరులతో పాటు టీడీపీ, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన విషయం తెలిసిందే. డ్రగ్స్ తీసుకోవటమే కాకుండా డ్రగ్స్ తో కలిపి వీరు పోలీసులకు దొరికారు. ఈ విషయం వెలుగుచూసిన దగ్గర నుండి శనివారం రాత్రి నుండి ఆదివారం సాయంత్రం వరకు తెలుగురాష్ట్రాల్లో సంచలనమైంది. ఆదివారం సాయంత్రానికి పుట్టాకు మొయినాబాద్ పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు. ఎందుకంటే సోమవారం నుండి పార్లమెంటు సమావేశాలు ఉన్నాయని.

ఆదివారం ఉదయం మీడియాతో మాట్లాడుతు ‘‘రక్తపరీక్షల్లో ఆరుగురికి పాజిటివ్ వచ్చిందని వీరందరినీ కోర్టులో ప్రవేశపెట్టబోతున్నాము’’ అని ఈగల్ టీమ్ ఎస్పీ గిరిధర్ చెప్పారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారిని కోర్టులో ప్రవేశపెడితే రిమాండ్ తప్పదు. ఆ రిమాండ్ ఎంతకాలం అన్నది డ్రగ్స్ తీవ్రతను బట్టి ఆధారపడుంటుంది. ఎంతకాలమైనా సరే రిమాండ్ అయితే తప్పదు.

అలాంటిది సాయంత్రానికి పోలీసులు పుట్టాకు స్టేషన్ బెయిల్ ఎలా ఇచ్చేశారు ? శనివారం రాత్రెప్పుడో చేసిన బ్లడ్ టెస్టుల్లో ఆరుగురికి పాజిటివ్ వస్తే వెంటనే మెజిస్ట్రేట్ ముందు ఎందుకు హాజరుపరచలేదు ? పోనీ రాత్రి ఎందుకులే అనుకున్నా ఆదివారం ఉదయమే హాజరుపరచాలి కదా. మెజిస్ట్రేట్ ముందు కాని లేదా కోర్టులో కాని ఆరుగురిని ప్రవేశపెట్టకుండా పోలీసులు ఎందుకు తాత్సారం చేశారు ? చివరకు పుట్టాతో పాటు మిగిలిన ఐదుగురిని ప్రవేశపెట్టకుండానే పుట్టాకు స్టేషన్ బెయిల్ ఎందుకు ఇచ్చేశారు ? ఒకసారి స్టేషన్ బెయిల్ ఇచ్చిన తర్వాత ఇక పుట్టాను తిరిగి అరెస్టుచేసేదేముంటుంది. కోర్టుకు వెళ్ళి ఎంపీ బెయిల్ తెచ్చేసుకుంటారు అనటంలో సందేహంలేదు.

అసలు ఉదయం నుండే సోషల్ మీడియాలో ప్రచారం బాగా జరుగుతోంది. అదేమిటంటే పుట్టాను రక్షించటానికి రెండురాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖులు మాట్లాడుకుంటున్నారని. కారణం ఏమిటంటే పుట్టా మామూలు ఎంపీ కాదు. టీడీపీలో అత్యంత సీనియర్లలో ఒకడు, మాజీమంత్రి యనమల రామకృష్ణుడికి స్వయాన అల్లుడు. కడప జిల్లా మైదుకూరు మాజీ ఎంఎల్ఏ, టీటీడీ ట్రస్ట్ బోర్డ్ మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కొడుకు. పుట్టా అయినా యనమల అయినా చంద్రబాబునాయుడుకు ఎంతటి సన్నిహితులో అందరికీ తెలిసిందే.

బంధుత్వం ఇక్కడితో ఆగలేదు. తెలంగాణలోని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కు దగ్గర బంధువు. వీళ్ళందరికీ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో చాలా సన్నిహితముంది. ఇంతటి పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న తర్వాత పుట్టాను అరెస్టుచేసి రిమాండుకు పంపేంత సీనుందా పోలీసులకు అని ఉదయం నుండే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తెరవెనుక ఏమి జరిగిందో తెలీదుకాని చివరకు పుట్టాకు స్టేషన్ బెయిల్ ఇచ్చేయటంతో జరిగిన ప్రచారమంతా నిజమేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

Read More
Next Story