కేరళలో రాహుల్ ఎన్నికల వేడిని రాజేశారా?
x
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

కేరళలో రాహుల్ ఎన్నికల వేడిని రాజేశారా?

కొచ్చిలో గాంధీ నిర్వహించిన సన్మాన కార్యక్రమం లక్ష్యం ఏంటీ?


ఈ ఏడాది జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అనధికారికంగా తన సన్నాహాలను ప్రారంభించింది. దీనిని పార్టీ అనధికార కాంగ్రెస్(Congress) అధ్యక్షుడు, అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్వయంగా ప్రారంభించి రాష్ట్రంలో ఎన్నికల వేడిని రాజేశారు.

నిన్న కొచ్చి(Kochi)లో ‘మహా పంచాయతీ’ పేరుతో సోమవారం నిర్వహించిన కార్యక్రమం 2026 కేరళ(Kerala) అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు సన్నాహాకంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

వాస్తవంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ప్రతినిధులను సత్కరించేందుకు ఏర్పాటు చేసిన ఈ సభ.. రాబోయే ఎన్నికలపై పార్టీ ఆశావాదాన్ని ప్రతిబింబించింది.

ఆర్ఎస్ఎస్- బీజేపీ పై రాహుల్ నిప్పులు..
ఇటీవల కేరళలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం యూడీఎఫ్ పై ప్రజల్లో పెరిగిన నమ్మకానికి నిదర్శనంగా రాహుల్ అన్నారు.
ఆయన సోమవారం కొచ్చి లోని మెరైన్ డ్రైవ్ లో వేలాది మంది పంచాయతీ మున్సిపల్ ప్రతినిధులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ పేరు ప్రస్తావించకుండానే ఆయన కూటమిపై విమర్శలు గుప్పించారు.
భారత్ లో అధికారిక కేంద్రీకరణ పద్దతులకు కాంగ్రెస్ పార్టీ పూర్తి వ్యతిరేకమని చెప్పారు. అధికార వికేంద్రీకరణే ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని స్పష్టం చేశారు. స్థానిక స్వపరిపాలన బలంగానే ఉంటేనే రాజ్యాంగ విలువలు కూడా బలంగా ఉంటాయని ఆయన వివరించారు.
దక్షిణాది రాష్ట్రమైన కేరళలో మత, సాంస్కృతిక విభేదాలకు అతీతంగా ఐక్యంగా ఉందని ఆయన ప్రశంసించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుతో రాజీ పడలేమని, ప్రజలు తమ అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తపరచాల్సిన అవసరం ఉందని అన్నారు.
దేశంలో బీజేపీ- ఆర్ఎస్ఎస్ అధికార కేంద్రీకరణకు పాల్పడుతున్నాయని వాటిపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ కచ్చితంగా వికేంద్రీకరణకు మద్దతు ఇస్తుందన్నారు. నిశ్శబ్దం, నిర్లక్ష్యం పెరిగితే ప్రజాస్వామ్యం బలహీనపడుతుందని హెచ్చరించారు.
స్థానిక నాయకులే కీలకం..
అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీషన్ మాట్లాడుతూ.. యూడీఎఫ్ భవిష్యత్ రాజకీయాలకు స్థానిక సంస్థల ప్రతినిధులు పోషించే పాత్ర కీలకమని వ్యాఖ్యానించారు. అభివృద్ధి, పారదర్శకత, సామాజిక న్యాయం యూడీఎఫ్ రాజకీయ కార్యాచరణలో కేంద్రంగా ఉంటాయని స్పష్టం చేశారు.
2016, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ వరుస పరాజయాల తర్వాత.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు కాంగ్రెస్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయని పార్టీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
అట్టడుగు స్థాయి కార్యకర్తల బలం, ప్రజలతో నేరుగా ఉన్న అనుబంధమే 2026 ఎన్నికల్లో యూడీఎఫ్‌కు విజయ మార్గమని నేతలు విశ్వసిస్తున్నారు.
మనమే కచ్చితంగా గెలుస్తాం..
కేరళ రాజకీయ సంస్కృతి ఎప్పుడూ చర్చ, భాగస్వామ్యం, సామాజిక చైతన్యంతో ముందుకు సాగుతున్నాయని రాహుల్ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం దేశంలో సమాజాన్ని విభజించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయని ఆయన పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. అనుమానం, శత్రుత్వం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తాయని ఆయన హెచ్చరించారు.
ఉద్యోగావకాశాల కోసం యువత విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి రావద్దని, అందుకోసం వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ ఘన విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కొచ్చి సభ ఒక విజయోత్సవం మాత్రమే కాదు. ఇది యూడీఎఫ్ రాజకీయ పునఃప్రారంభానికి సంకేతం. ఈ ఆశావాదాన్ని ప్రజల నమ్మకంగా మార్చగలిగితేనే 2026 ఎన్నికల్లో యుడిఎఫ్ నిజమైన పోటీగా నిలబడగలదు. కొచ్చి నుంచి వచ్చిన సంకేతం స్పష్టం — కాంగ్రెస్ కేరళలో మళ్లీ రాజకీయ సమీకరణకు సిద్ధమవుతోంది.
Read More
Next Story