పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలం ఎంత?
x

పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలం ఎంత?

12,754 పంచాయతీల్లో 650 మాత్రమే గెలిచిన బీజేపీ, 3,502 గెలిచిన బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమా!!!


గ్రామీణ ప్రాంతాల్లో అన్నీ పంచాయతీలకు అభ్యర్థులు దొరకని బీజేపీ అన్ని వార్డులలో పోటీ చేయగలుగుతుందా

మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ తమకు పోటీ కాదని కాంగ్రెస్ ఏ తమ ప్రత్యర్ధి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలోని 10 కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలకు బిజెపి తయారై ఉందన్నారు.

రాష్ట్రంలో వున్న 12,754 గ్రామ పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో కేవలం 5,000 స్థానాల్లో పోటీచేసిన బీజేపీ కేవలం 650 సీట్లు సాధించింది. బిఆర్ఎస్ 12,000 స్థానాలకు పోటీ చేసి 3,502 సీట్లు సాధించింది. బీజేపీ పార్టీ కంటే ఇండెపెండెంట్లుగా పోటీచేసిన అభ్యర్థులే రాష్ట్రంలో ఎక్కువ సీట్లు సాధించారు. మరి ఈ పరిస్థితుల్లో బిఆర్ఎస్ కు మేమే ప్రత్యామ్నాయం అని చెప్పటంలో ఆయన ఉద్దేశం ఏమిటో అనే ఊహాగానాలు జరుగుతున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో చతికల పడ్డ బీజేపీ తాము బలంగా ఉన్నామని చెప్తున్న పట్టణ ప్రాంతాల్లో అభ్యర్థులు దొరుకుతారా. రాష్ట్రంలో 10 కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రతి మున్సిపాలిటీ లోనూ కనీసం 40 వార్డుల వరకు వుంటాయి. పైగా బిఆర్ఎస్ పార్టీ ప్రజల్లో పూర్తిగా కనుమరుగైంది త్వరలో ఆ పార్టీ ముక్కలవ్వడం ఖాయం అని భవిష్యత్తు పై ఊహాగానాలు చేస్తున్నారు. దోచుకున్న ప్రజాసొమ్మును పంచుకోవడంలో వున్న పార్టీ ప్రజల ఆకాంక్షలను వమ్ము చేసి ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారని అంటున్నారు.

హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్‌లో మహారాష్ట్ర లోని ముంబై ఇతర మునికిపాలిటీల్లో పార్టీ గెలిచిన సందర్భంగా జరిగిన విజయ్ సంకల్ప సమ్మేళనంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

“తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ఏది? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? రైతుబంధు బంద్ పెట్టారు. ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం నేడు 40 శాతం కమీషన్ల ప్రభుత్వంగా మారింది. మంత్రుల మధ్య బహిరంగ ఘర్షణలు జరుగుతున్నాయి. పారిశ్రామికవేత్తలను తుపాకీ పెట్టి బెదిరింపులకు దిగుతున్నారు. గత 11 ఏళ్లలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి సుమారు రూ. 12 లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చింది,” అన్నారు.

మహారాష్ట్ర మునిసిపల్ ఎన్నికల్లో 29 మున్సిపల్ కార్పొరేషన్లలో 25 కార్పొరేషన్లను బిజెపి కైవసం చేసుకుందని చెప్తూ, “మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సుమారు 52 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర జనాభాలో ఒక వంతు హైదరాబాద్‌లో, మరొక వంతు గ్రామీణ ప్రాంతాల్లో, మూడో వంతు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నివసిస్తున్నారు. మన భవిష్యత్తు బాగుండాలంటే డబుల్ ఇంజిన్ సర్కారు రావాలి. పట్టణాలు అభివృద్ధి చెందాలంటే, పేదలకు ఇండ్లు రావాలంటే, ఆరోగ్య భద్రత కావాలంటే- అది కేవలం నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చే పథకాల ద్వారానే సాధ్యం. వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటోంది. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదు? ఫసల్ బీమా యోజనను ఎందుకు అమలు చేయడం లేదు? కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి,” అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

Read More
Next Story