సికింద్రాబాద్ మునిసిపాలిటీ ఎలా అయింది? 18 అబ్బుర పరిచే చారిత్రక సత్యాలు
x
రెండిషన్ అగ్రిమెంట్ మీద సంతకాలు చేస్తున్న నిజాం ప్రధాని నవాబ్ చత్తారి, బ్రిటిష్ రెసిడెంట్ సర్ ఆర్థర్ లోధియన్

సికింద్రాబాద్ మునిసిపాలిటీ ఎలా అయింది? 18 అబ్బుర పరిచే చారిత్రక సత్యాలు

రెండిషన్ అగ్రిమెంట్ అంటే ఏమిటి?


సికింద్రాబాద్ ని ప్రత్యేకంగా మునిసిపల్ కార్పొరేషన్ చేయాలనే డిమాండ్ మొదలయింది. చిన్నగా ఆందోళన కూడా జరుగుతూ ఉంది. ఈ డిమాండ్ కు ప్రజల మద్దతు కూడా లభిస్తూఉంది. ఇపుడు సికింద్రాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లో భాగం. నగరాన్ని మూడు కార్పొరేషన్లు చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నది. ఇది జరిగిగే, సికింద్రాబాద్ మల్కాజ్ గిరి కార్పరేషన్ లో భాగమవుతుందని అంటున్నారు. ఇలా చేయడం సికింద్రాబాద్ కల్చలర్ ఐడెంటీకి దెబ్బ అని అసలు సికింద్రాబాద్ ను ప్రత్యేక కార్పొరేషన్ చేయాలని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ జనసమీకరణ మొదలుపెట్టారు. నిజానికి సికింద్రాబాద్ ఒకపుడు ప్రత్యేక మునిసిపల్ కార్పొరేషన్ గా ఉండింది. 1960లో దీనిని హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లో విలీనం చేశారు. జిహెచ్ ఎంసి ని డీసెంట్రలైజ్ చేస్తున్నందున సికింద్రాబాద్ ను ప్రత్యేక కార్పొరేషన్ చేయాలని కోరడం సబబే అనిపిస్తుంది. దీని వెనక రాజకీయాలెలా ఉన్నా, సికింద్రాబాద్ నగరం మునిసిపాలిటీగా ఏర్పాటు కావడం వెనక ఆసక్తికరమయిన చరిత్ర ఉంది. అదేంటో చూద్దాం.


రెండిషన్ అగ్రిమెంట్

అది 1945. అవి స్వాతంత్య్ర పోరాటం ముమ్మరంగా జరుగుతున్న రోజులు. తొందర్లోనే భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధిస్తుందని అంతా నమ్ముతున్నారు. ముఖ్యంగా బ్రిటిష్ వాళ్లు మూట ముళ్లె సర్దుకోవడం మొదలుపెట్టారు. అప్పటికి సికింద్రాబాద్ మొత్తం బ్రిటిష్ కంట్రోల్ లో ఉంది. ఇక్కడ నివస్తున్నప్రజలకు పౌరసౌకర్యాలు పెంచాల్సిన అవసరం వస్తున్నది.అందువల్ల సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో అలెగ్జాండర్ రోడ్ కు దక్షిణాన ఉన్న ప్రాంతాలను బ్రిటిష్ ప్రభుత్వం నిజాం అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు 1945 డిసెంబర్ 1న నిజాం ప్రధాని నవాబ్ చత్తారి, హైదరాబాద్ బ్రిటిష్ రెసిడెంట్ సర్ అర్థర్ లోథియన్ (Sir Arthur Lothian)ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది, అదే రెండిషన్ అగ్రిమెంట్ (Agreement of Rendition). ఈ ఒప్పందం ప్రకారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని పౌర నివాస ప్రాంతాలన్నీ నిజాం ఏలుబడి లోకి వచ్చాయి. ఆలెగ్జాండర్ రోడ్ ఉత్తరాన ఉన్న కంటోన్మెంట్ ప్రాంతం మాత్రమే బ్రిటిష్ ఆదీనంలో ఉండిపోయింది. ఈ ప్రాంత్రాన్ని రిటైన్డ్ ఏరియా ( Retained Area) అని పిలిచేవారు. సాతంత్య్రం వచ్చాక కంటోన్మెంట్ పరిపాలన భారత ప్రభుత్వానికి నికి బదిలీ అయింది. రెండిషన్ అయిన ప్రాంతాన్ని ‘రెస్టోర్డ్ ఏరియా’ (Restored Area) అని పిలిచే వారు.

* రెండిషన్ అగ్రిమెంట్ లో కొన్ని ఆసక్తికరమయిన షరతులున్నాయి. రెస్టోర్డ్ ఏరియాలో వీధులున్నీశుభ్రంగా ఆరోగ్యం కరంగా ఉండాలి. వాటిని హై స్టాండర్డ్స్ తో మెయింటెయిన్ చేయాలి. బార్లు రాత్రి 9.30 దాకా తెరిచి ఉంచాలి. పెర్సీస్, మాంట్ గోమరి, వైట్ హాల్ హోటెల్స్ లోకి బ్రిటిష్ అధికారులను అనుమతించాలి.

*ఈ రెస్టోర్డ్ ఏరియా ఆలనా పాలనా చూసేందుకు ఒక కమిటీ అవసరమయింది. హైదరాబాద్ మునిసిపల్ అండ్ టౌన్ కమిటీస్ యాక్ట్ ( Hyderabad Municipal and Town Committee Act) ప్రకారం కమిటీ ఏర్పాటుచేశారు. దీనినే సికింద్రాబాద్ మునిసిపల్ కమిటీ అని పిలిచారు. దీనికి సేవిడ్జ్ (Mr Savidge) అనే వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సేవిడ్జ్ గురించి పెద్దగా సమాచారం అందుబాటులో లేదు.

*ఈ కమిటీలో కొంతమంది సికింద్రాబాద్ పుర ప్రముఖుల, నిజాం ప్రభుత్వ పెద్దలు సభ్యులుగా ఉండేవారు. సికింద్రాబాద్ మునిసిపల్ కమిటీ 1946 జనవరి 10న ప్రారంభమయింది. అధ్యక్షుడిని మీర్ ఇ మజ్లిస్ (Mir-E-Majlis)అని పిలిచేవారు. కమిటీని మజ్లిస్ అన్నారు.

*ఈ మజ్లిస్ లో నాలుగు సబ్ కమిటీలు ఉండేవి. అవి: వర్క్ అండ్ బిల్లింగ్ సబ్ కమిటీ, ఎసెస్ మెంట్ కమిటీ (Assessment subcommittee), హెల్త్ సబ్ కమిటీ, ఫైనాన్స్ సబ్ కమిటీ.

* అప్పటి మునిసిపల్ కార్పొరేషన్ లో 12 వార్డులుండేవి. అయితే, 32 మంది కౌన్సిలర్లు ఉండేవారు. ఇందులో 28 మంది ఎన్నికయిన వారు. వార్డు సైజ్ ను బట్టి ఒక్కో వార్డులో ఇద్దరు లేదా ముగ్గురు కౌన్సిలర్లు ఉండేవారు.

* సికింద్రాబాద్ కార్పొరేషన్ లో నలుగురు నామినేటెడ్ సభ్యులుండే వారు.

*1951 దాకా ఈ మునిసిపల్ కమిటీయే సికింద్రాబాద్ స్థానిక పాలనను నిర్వహించింది. ఆ యేడాది హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1950, ప్రకారం సికింద్రాబాద్ హోదాని కార్పొరేషన్ స్థాయికి పెంచారు.

*1951లో ఈ సికింద్రాబాద్ కార్పొరేషన్ కు వయోజన ఓటు హక్కు ప్రకారం ఎన్నికలు జరిగాయి. హైదరాబాద్ జరిగిన మొట్టమొదటి ప్రజాస్వామిక ఎన్నిక ఇది. తొలిసారిగా మునసిపల్ కౌన్సిలర్లని ఎన్నుకుని మొదటి సారి ఎన్నికల్లో పాల్గొన్నారు.

*ఎన్నికైన కౌన్సిలర్లు 1951 ఏప్రిల్ 16న మొదటి సారి సమావేశమయి సికింద్రాబాద్ ‘గ్రాండ్ ఓల్డ్ మ్యాన్’ అని పేరున్న వాసుదేవ్ ముదలియార్ ను మేయర్ గా ఎన్నుకున్నారు. అంటే వాసుదేవ్ ముదలియార్ సికింద్రాబాద్ తొలిమేయర్.

*ఈ సమావేశానికి అప్పటి స్థానిక పరిపాలన శాఖ మంత్రి పూల్ చంద్ గాంధీ ముఖ్యఅతిధిగా హాజరయి సికింద్రాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ను ప్రారంభించారు.

*అనాటి సికింద్రాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఆఫీసు మహాత్మాగాంధీ రోడ్ లో ఉండేది. తర్వాత అది పద్మారావ్ ముదలియార్ ఆదీనంలోకి వెళ్లంది. ఆ చారిత్రక భవనంలో పూర్వం ఫ్రెంచ్ రాయబార కార్యాలయం ఉండింది.

* తొలి కార్పొరేషన్ ఏర్పడినపుడు ఉన్న వార్డులు, కౌన్సిలర్లు

1. బేగంపేట్ : బివి గురుమూర్తి, ఎంపి, అనంత బుచ్చన్న

2. రామ్ గోపాల్ పేట్ (నల్ల్లగుట్ట): డాక్టర్ వై ఎన్ తిమ్మారాజు, మహ్మద్ సిద్దిఖీ

3. వోల్డ్ బోయిగూడ: ఎ. సర్దార్ సింగ్, ఉప్పు నారాయణ

4. అవుల్మంద: ఆర్ బి వీరయ్య, ఎ విశ్వనాథరావు,

5. జీరా: ఎ రంగపాండు, శ్రీమతి సుశీల దేవి

6. బన్సీలాల్ పేట్ గాదేపల్లి జగన్నాథం, జె వెంకటేశం, ఎంలక్ష్మయ్య

7. ఆదయ్య నగర్ (ఘాస్ మండి:) ఎం రామచంద్రయ్య, ఆర్ వెంకటేశం, జెపి కాశీనాథం

8. ఇమామ్ బౌడి: విసి ముత్తన్న మొదలియార్, ఎస్ సత్యనారాయణ గుప్త

9. హిమ్మత్ నగర్ (రెజిమెంటల్ బజార్): ఇఎం మైఖేల్ ఎస్ బి గిరి,.

10. నెహ్రూనగర్ (మారేడ్ పల్లి): దేవీ సింగ్, టి సాంబయ్య,

11. చిలకలగూడ: ఎస్ జి గజపతిరావు, బి మల్లికార్జున్, జె ఈశ్వరీబాయి

12. లాలాగూడ: వి జగన్నాథం, పివి మనోహర్, యు నారాయణ స్వామి

నామినేటెడ్ మెంబర్స్

1.సేట్ ముకుంద్ దాస్ మాలనీ

2. సునందా దేవీ

3. వెంకటనాథ శాస్త్రి

4. సిఎ నాయుడు

*మునిసిపల్ జనరల్ బాడీ నెలకొకసారి సారి సమావేశం కావాలి. అది కూడా ప్రతినెల 20వ తేదీ లోపు సమావేశం కావాలి.

* అపుడు మేయర్ పదవీ కాలం ఒక యేడాది మాత్రమే. వాసుదేవ్ ముదలియార్ 1951-52 లో మేయర్ గా ఉన్నారు. ఆ తర్వాత వై.ఎన్ తిమ్మరాజు (1952-53), అన్నారావు, బివి గురుమూర్తి ( 1953-54) మేయర్లు గా ఎన్నికయ్యారు.

* 1945-46లో సికింద్రాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కు పన్నుల ద్వారా వచ్చి ఆదాయం రు. 4,88,500. ఇది 1954-55 నాటికి రు.15, 98,400 కు పెరిగింది.

* సికింద్రాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ విశేషమేమిటంటే, వార్డుల తనిఖీ. ఈ తనఖీలో మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ చైర్మన్, వర్క్స్-బిల్డింగ్ కమిటీ చైర్మన్, వార్డుకౌన్సిలర్లు, కమిషనర్ల, సిటీ ఇంజనీరు, మెడికల్ ఆఫీసర్, కన్సర్వెన్సీ ఆఫీసర్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ తప్పనిసరిగా ఉండేవారు.

* సికిందకరాబాద్ మునిసిపాలిటీలో చాలా ఘనంగా వనమహోహత్సవం జరిగేది. మొదటి వనమహోత్సవం 1950లో జరిగింది.దీనిని స్థానిక పాలన మంత్రి పూల్ చంద్ గాంధీ ప్రారంభించారు. ఆ సందర్భంగా క్లాక్ టవర్ గార్డెన్ లో 450 నీడనిచ్చే చెట్లు నాటారు.

Read More
Next Story