Eetala Rajender
x
Eetala Rajendar

‘మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్ళేదిలేదు’

పార్టీలు మారటం అంటే బట్టలు మార్చుకున్నంత ఈజీకాదన్నారు


పార్టీమార్పుపై జరుగుతున్న ప్రచారంపై బీజేపీ మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ క్లారిటి ఇచ్చారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతు తాను మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళతానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదు అన్నారు. తనపై కావావాలనే దుష్ప్రచారం చేస్తున్నట్లు మండిపడ్డారు. పార్టీలు మారటం అంటే బట్టలు మార్చుకున్నంత ఈజీకాదన్నారు. బీఆర్ఎస్ నుండి తనను బయటకు గెంటేసి ఈరోజుతో ఐదేళ్ళు అవుతోందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ విధానాలు నచ్చకే తాను పార్టీలోనుండి బయటకువచ్చేసినట్లు స్పష్టంచేశారు. తనకు లాగే పొంగులేటి శ్రీనివాసులరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి లాంటి నేతలు పార్టీలో నుండి బయటకు వచ్చేసిన విషయాన్ని ఈటల గుర్తుచేశారు.

పోటీగురించి మాట్లాడుతు ఏపార్టీలో అయినా నేతల మధ్య పోటీ తప్పదని క్లారిటి ఇచ్చారు. పదవుల కోసం పార్టీ మారే వ్యక్తిని కాదన్నారు. ఏదో ఆశించి తాను పార్టీ మారినట్లు జరుగుతున్న ప్రచారాన్ని తప్పుపట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తనను కాంగ్రెస్ లోకి ఆహ్వానించినపుడే తాను చేరలేదని చెప్పారు. తనలాంటి పొటెన్షియల్ లీడర్ కాంగ్రెస్ లోకి రావాలని వైఎస్సార్ అప్పట్లో చాలా ఆకాంక్షించినట్లు గుర్తుచేశారు.

తాను తప్పని పరిస్ధితుల్లోనే పార్టీని మారాల్సొచ్చిందన్నారు. తాను సోషల్ మీడియాలో ఉండే వ్యక్తిని కాదని చెప్పారు. సోషల్ మీడియాలో కన్నా ప్రజల్లో ఉండటానికే ఇష్టపడతానని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. పార్టీలో నుండి బయటకు పంపేక్రమంలో తనను తీవ్రంగా భయపెట్టిన విషయాన్ని మరచిపోలేనని అన్నారు. కేసీఆర్ నియంతపోకడలన్నీ సమాజానికి తెలిసిందన్నారు. మొత్తం వ్యవస్ధలను చేతిలో పెట్టుకుని తనను అత్యంత దారుణంగా అవమానించినట్లు మండిపడ్డారు. ఇన్ని జరిగిన తర్వాత మళ్ళీ తాను బీఆర్ఎస్ లోకి ఎలాగ వెళతానని ఈటల ఎదురు ప్రశ్నించారు.

కరీంనగర్ జిల్లాలో జీవన్ రెడ్డి, బొడిగెశోభ, తాను టీఆర్ఎస్ లోకి వెళ్ళారని జరుగుతున్న ప్రచారం పిచ్చి ప్రచారంగా కొట్టేశారు. 20 ఏళ్ళపాటు బీఆర్ఎస్ లో ఉన్నకారణంగా సహజంగానే చాలామంది నేతలతో తనకు పరిచాయులున్నాయని చెప్పారు. ప్రజల ముందు తన క్యారెక్టర్ ను కించిపరిచేట్లుగా కేసీఆర్ ప్రయత్నించారని మండిపోయారు. తనను అభిమానించే చాలామంది ఈటలరాజేందర్ లాంటి లీడర్ బీఆర్ఎస్ లోకి వెళితే బాగుంటుందనే చర్చ జరుగుతోందని చెప్పారు. అయితే ఇలాంటి చర్చ, ప్రచారాని ఆపాల్సిన బాధ్యత తనపైన ఉందన్నారు. అందుకనే తాను తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్ళేది లేదనే క్లారిటి ఇస్తున్నట్లు చెప్పారు.

Read More
Next Story