తెలంగాణ రాజకీయాల్లో డ్రగ్స్ చిచ్చు, కేటీఆర్ టెస్టుకు రావాలని బొమ్మ డిమాండ్
x
TPCC President Bomma Mahesh Kumar Goud

తెలంగాణ రాజకీయాల్లో డ్రగ్స్ చిచ్చు, కేటీఆర్ టెస్టుకు రావాలని బొమ్మ డిమాండ్

బీఆర్ఎస్ మాజీ ఎంఎల్ఏ పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తీసుకుంటు కొందరు ప్రముఖులు పోలీసుల దాడిలో పట్టుబడటం ఇపుడు సంచలనంగా మారింది


తెలంగాణ రాజకీయాల్లో డ్రగ్స్ చిచ్చు రేగుతోంది. మొయినాబాద్ లోని బీఆర్ఎస్ మాజీ ఎంఎల్ఏ పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తీసుకుంటు కొందరు ప్రముఖులు పోలీసుల దాడిలో పట్టుబడటం ఇపుడు సంచలనంగా మారింది. రోహిత్ ఫామ్ హౌస్ లో శనివారం రాత్రి డ్రగ్స్ తీసుకోబోతున్న సమాచారం పోలీసులకు ఉప్పందింది. దాంతో ఫామ్ హౌస్ పై ఈగల్ టీమ్, ఎస్ఒటీ బృందాలు నిఘాపెట్టాయి. మధ్యాహ్నం 3 గంటలకు మొదలైన పార్టీలో 5 గంటలకు కొందరు జాయిన్ అయ్యారు. పార్టీ పీక్స్ కు చేరుకుంది అని నిర్ధారించుకున్న పోలీసులు రాత్రి 7 గంటలకు ఒక్కసారిగా దాడిచేశారు. ఆ దాడిలో రోహిత్ రెడ్డితో పాటు టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, రోహిత్ సోదరుడు, రాజస్ధాన్ లోని జైపూర్ మాజీ ఎంఎల్ఏ నమిత్ శర్మతో పాటు మరో ఆరుగురుని అంటే మొత్తం 11మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని బ్లడ్ టెస్టులు చేయించారు.

వీరిలో ఆరుగురు రోహిత్ రెడ్డి, పుట్టా మధు యాదవ్, రోహిత్ సోదరుడు రితేష్ రెడ్డి, నమిత్ శర్మ, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవికి పాజిటివ్ వచ్చింది. అంటే వీరు ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నారని రక్త పరీక్షలో తేలింది. దాంతో వీళ్ళందరినీ ఆదివారం మధ్యాహ్నం కోర్టులో ప్రవేశపెట్టారు.

ఫామ్ హౌస్ మీద పోలీసుల దాడి చేయటం, రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డితో పాటు మరో నలుగురికి పాజిటివ్ వచ్చిందన్న విషయం తెలియగానే బీఆర్ఎస్ సీరియస్ గా స్పందించింది. కాంగ్రెస్ ప్రభుత్వ కక్షసాధింపులకు దిగుతున్నట్లు ఆరోపించింది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే బీఆర్ఎస్ నేతలపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టి డ్రగ్స్ కేసుల్లో ఇరికిస్తున్నట్లు మండిపడుతున్నారు.

ఇదే విషయమై పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ గా స్పందించారు. బీఆర్ఎస్ పాలనలో డ్రగ్స్ విచ్చలవిడిగా యువతకు అందుబాటులోకి వచ్చిందన్నారు. డ్రగ్స్ తీసుకుంటు పట్టుబడిన తర్వాత కూడా పోలీసులు కేసుల్లో అక్రమంగా ఇరికిస్తోందన్న ఆరోపణల్లో అర్ధంలేదన్నారు. డ్రగ్స్ తీసుకునే వారిలో కేటీఆర్ పైనకూడా తనకు అనుమానాలు ఉన్నట్లు ఆరోపించారు. కేటీఆర్ రక్తపరీక్షలకు రావాలని బొమ్మ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో డ్రగ్స్ వాడకానికి రాష్ట్రం కేంద్రగా మారిపోయిందన్నారు. కేటీఆర్ కు చిత్తశుద్ది ఉంటే వెంటనే డ్రగ్స్ పరీక్షలకు హాజరుకావాలని సవాలు విసిరారు. సోమవారం నుండి ప్రారంభమవుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయాన్ని చర్చించబోతున్నట్లు బొమ్మ చెప్పారు.

Read More
Next Story