x

కొండా వ్యవహారం తుపాను ముందరి ప్రశాంతతేనా ?

రేవంత్ మంత్రివర్గంలో సభ్యురాలిగా ఉన్న సురేఖ తన కూతురు సీఎంను నోటికొచ్చినట్లు మాట్లాడితే తనకు సంబంధంలేదని చెప్పటమే అందరిలోను వ్యతిరేకత పెంచేసింది


మంత్రి కొండాసురేఖ మీద చర్యలు తీసుకోవటం అన్నది తుపాను ముందర ప్రశాంతతగా కనబడుతోంది. సీఎం రేవంత్ రెడ్డిపైన మంత్రి కూతురు కొండా సుస్మిత వారంరోజుల క్రితం నోటికొచ్చినట్లు మాట్లాడిన విషయం తెలిసిందే. సీఎం మీద కూతురు నోటికొచ్చినట్లు మాట్లాడిన కారణంగా తల్లి, మంత్రి కొండా సురేఖ ఇపుడు వివాదంలో పూర్తిగా ఇరుక్కునిపోయారు.

రేవంత్ మీద కూతురు నోటికొచ్చినట్లు మాట్లాడటాన్ని మంత్రిగా ఖండించకపోగా తల్లిగా మద్దతిస్తున్నట్లు ఉంది సురేఖ వ్యవహారం. సీఎంపై తన కూతురు నోటికొచ్చినట్లు మాట్లాడటానికి తనకు సంబంధంలేదని సురేఖ చెప్పటమే మరీ విడ్డూరంగా ఉంది. రేవంత్ మంత్రివర్గంలో సభ్యురాలిగా ఉన్న సురేఖ తన కూతురు సీఎంను నోటికొచ్చినట్లు మాట్లాడితే తనకు సంబంధంలేదని చెప్పటమే అందరిలోను వ్యతిరేకత పెంచేసింది.

రేవంత్ కు వ్యతిరేకంగా కూతురు మాట్లాడిన మాటలకు తెరవెనుక మంత్రి ప్రోద్బలం ఉందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అందుకనే రేవంత్ మంత్రివర్గం నుండి కొండా సురేఖను తప్పించాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి. సురేఖ వివాదంపై ఇప్పటికే పీసీసీ క్రమశిక్షణా కమిటి రెండుసార్లు మంత్రి వివరణ తీసుకున్నది. రెండుసార్లు కూడా కూతురి వ్యాఖ్యలతో తనకు సంబంధంలేదని మంత్రి స్పష్టంచేశారు.

మంగళవారం క్రమశిక్షణ కమిటితో పాటు పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ నివేదికలు ఏఐసీసీకి అందబోతున్నాయి. మంత్రివర్గం నుండి అధిష్ఠానమే సురేఖను తప్పిస్తుందా ? లేకపోతే తనంతట తానుగా మంత్రి పదవికి సురేఖతో రాజీనామా చేయిస్తుందా అన్నదే సస్పెన్స్ గా మారిపోయింది.

Read More
Next Story