బీఆర్ఎస్ లో సంతోష్ డబుల్ యాక్షన్ చేస్తున్నాడా ?
x
BRS former MP Joginapally Santosh Rao

బీఆర్ఎస్ లో సంతోష్ డబుల్ యాక్షన్ చేస్తున్నాడా ?

తాను ఇంతకాలంగా చెబుతున్న బీఆర్ఎస్(BRS) లోని మొదటి దెయ్యం రాజ్యసభ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావే అన్నారు


ఎంతోకాలంగా జనాల్లో చాలామందికి అర్ధంకాని దెయ్యం ఎవరో ఇపుడు బయటపడింది. బీఆర్ఎస్ లో నుండి గెంటివేతకు గురైన కల్వకుంట్ల కవిత(Kavitha) మంగళవారం మీడియాతో మాట్లాడుతు తాను ఇంతకాలంగా చెబుతున్న బీఆర్ఎస్(BRS) లోని మొదటి దెయ్యం రాజ్యసభ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావే అన్నారు. (KCR)కేసీఆర్ పక్కనే ఉంటున్న సంతోష్ దెయ్యం మాత్రమే కాదని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ప్రధాన గూఢచారి కూడా అని ఆరోపించారు. ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఫుల్ ఇడ్లీ తిన్నారా ? లేకపోతే అర్ధ ఇడ్లీనే తిన్నారా అన్న విషయాన్ని కూడా రేవంత్(Revanth) కు సంతోషే చేరవేస్తుంటారని ఎద్దేవా చేశారు. మరికాసేపట్లో టెలిఫోన్ ట్యాపింగ్ విచారణకు సిట్ ముందు హాజరవుతున్న సమయంలో సంతోష్ పై కవిత ఆరోపణలతో రెచ్చిపోవటం గమనార్హం.

బీఆర్ఎస్ లో ఎందరి నేతలతో కన్నీళ్ళు పెట్టించిన దుర్మార్గుడు సంతోష్ అంటు మండిపడ్డారు. ప్రగతిభవన్ గేటు దగ్గరే గడ్డర్ ను నిలబెట్టింది, ఈటల రాజేందర్ పార్టీలో నుండి సస్పెండ్ అవటానికి కూడా సంతోషే కారణమన్నారు. ఉద్యమకారులకు, పేద ప్రజలకు కేసీఆర్ ను దూరంచేసింది కూడా ఈ దెయ్యమే అని రెచ్చిపోయారు. తన గూఢచారిని టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ కచ్చితంగా కాపాడుకుంటాడు అని కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

కవిత చెప్పింది అంతా బాగానే ఉందికాని ఇక్కడే ఒక అనుమానం మొదలైంది. ఉద్యమంలో సంతోష్ ఎక్కడా కనబడలేదు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో కూడా సంతోష్ పాత్ర లేదు. అలాంటిది సడెన్ గా పార్టీలో సంతోష్ అంత కీలకంగా ఎలా ఎదిగాడు ? కేసీఆర్ కు నీడలాగ సంవత్సరాల తరబడి సంతోష్ ఎలా మెలిగాడు అన్నదే కీలకమైన పాయింట్. అలాగే ఉద్యమకారులకు, పేదలకు కేసీఆర్ ను దూరంచేసింది కూడా సంతోషే అని కవిత అనటంలో లాజిక్ కుదుటంలేదు. ఎందుకంటే ఉద్యమకారులను, పేదలను దగ్గరకు తీసుకోవాలని కేసీఆర్ అనుకుంటే సంతోష్ ఏ విధంగా అడ్డుకోగలడు ?

అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ వైఖరే పూర్తిగా మారిపోయి ఉద్యమకారులను, అమరుల కుటుంబాలను, మద్దతుదారులందరినీ దూరం పెట్టేశారు. కేసీఆర్ తప్పులను కవిత కన్వీనియంట్ గా సంతోష్ మీదకు తోసేస్తున్నట్లు అనుమానంగా ఉంది. అధికారంలో ఉన్నపుడు కేసీఆర్ చేసిన తప్పులన్నింటినీ కవిత ఇపుడు సంతోష్ ఖాతాలో వేసేస్తోంది.

Read More
Next Story