ద్రావిడ అభివృద్ధి నమూనా దారితప్పుతోందా?
x
ఎడప్పాడి కే. పళనిస్వామి

ద్రావిడ అభివృద్ధి నమూనా దారితప్పుతోందా?

ఉచిత పథకాలలో రాష్ట్రంపై పెరుగుతున్న అప్పుల భారం


Click the Play button to hear this message in audio format

ఎన్నికల వేళ ఉచితాలతో దేశం దృష్టిని ఆకర్షించే తమిళనాడు, ఇప్పుడు మరోసారి అదే దారిలో ప్రయాణిస్తోంది. తాజాగా మ్యానిఫెస్టోను విడుదల చేసిన అన్నాడీఎంకే అనేక ఉచితాలకు హమీ ఇచ్చింది. ఇది రాష్ట్రంపై పెరుగుతున్న ఆర్థిక భారంపై ఆందోళనలను మళ్లీ రేకెత్తించింది.

ఎడప్పాడి కె పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే పార్టీ, 2.22 కోట్ల బియ్యం రేషన్ కార్డుదారులకు ఏటా ఉచిత రిఫ్రిజిరేటర్లు, మూడు గ్యాస్ సిలిండర్లు, విద్యా రుణాల పూర్తి మాఫీ, నెలకు 1 కిలో పప్పు, 1 లీటరు వంట నూనె సరఫరాతో పాటు అనేక ఇతర ప్రత్యక్ష ప్రయోజన పథకాలను అమలు చేస్తామని పేర్కొంది.

ద్రావిడ వృద్ధి నమూనా..

పెరిగిన ద్రవ్యోల్బణంతో బాధపడుతున్న తక్కువ ఆదాయ కుటుంబాలకు ఈ ప్రకటనలు తక్షణ ఉపశమనంగా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేనప్పటికీ, ఈ హామీల స్థాయి ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న తమిళనాడు ఆర్థిక వ్యవస్థపై మరింత భారం మోపవచ్చని ఆర్థిక నిఫుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే, రాష్ట్ర బడ్జెట్‌లో అత్యధిక భాగం చేసిన అప్పులు తీర్చడానికి, వాటి వడ్డీ చెల్లింపులకే పోతోంది.
ద్రవిడ ఉద్యమం తొలినాళ్లలో విద్య, రిజర్వేషన్లు, ప్రజా పంపిణీ వ్యవస్థపై పెట్టిన ప్రాధాన్యత నుంచి, ఇప్పుడు తమిళనాడు రాజకీయ సంస్కృతి ప్రత్యక్షంగా ఉచితాలు అందించి ఓట్లను పొందే వైపుకు మారింది. 1980లలో మధ్యాహ్న భోజన పథకం, 2006లో ఉచిత కలర్ టీవీల వంటి మార్గదర్శక కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ పథకాలు క్రమంగా విస్తరించి, మిక్సర్లు, గ్రైండర్లు, పెళ్లిళ్లకు బంగారం, ల్యాప్‌టాప్‌లు, ఇప్పుడు భారీస్థాయి నగదు బదిలీలు, గృహోపకరణాలను వంటి వాటికి విస్తరించాయి.
ఇటువంటి పథకాలు లక్షలాది మందికి, ముఖ్యంగా మహిళలు, అణగారిన వర్గాలకు ఉపయోగకరంగా మారినప్పటికీ, ఇవి ఎక్కువగా ప్రజలను ఉచితాల వైపు నెట్టివేసింది. అలాగే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెనుభారం మోపుతున్నాయి.

అభివృద్ధి వర్సెస్ ఉచితాలు..

ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త మణివన్నన్ ఈ రెండు విధానాల మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపారు. సంక్షేమం అనేది విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, గౌరవాన్ని, దీర్ఘకాలిక స్వావలంబనను పెంపొందించే ఉత్పాదక అవకాశాల ద్వారా మానవ సామర్థ్యాన్ని పెంపొందించాలని ఆయన కోరుతున్నారు.
దీనికి విరుద్ధంగా, ఉచితాలు తరచుగా తగిన ప్రతిఫలాలు లేకుండా స్వల్పకాలిక భౌతిక ఉపశమనాన్ని మాత్రమే అందిస్తాయి. ఇది పని చేసే ప్రేరణను దెబ్బతీసి, పాలనను పోటీతత్వ ప్రజాకర్షణ చక్రంగా మార్చే అవకాశం ఉంది.
రాష్ట్ర అప్పు ఇప్పటికే సుమారు రూ. 8 లక్షల కోట్లకు చేరగా, వార్షిక వడ్డీ చెల్లింపులు రూ. 40,000 కోట్లకు పైగా ఉన్నాయి. ఇలాంటి పథకాలను అనియంత్రితంగా విస్తరిస్తే, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, సుస్థిర వృద్ధి వంటి కీలక పెట్టుబడులకు ఆటంకం ఏర్పడవచ్చు" అని ఆయన హెచ్చరించారు. తమిళనాడు సంక్షేమ రాజకీయాలలో ఓటర్ల పక్షాన నిలబడే విధానానికి ఎం. కరుణానిధి మార్గదర్శకత్వం వహించగా, జె. జయలలిత ఆ నమూనాని పరిపూర్ణం చేసి, దానిని ఒక ఎన్నికల విజయ రథంగా మార్చారు.
2011లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆమె ప్రత్యక్ష ప్రయోజన పథకాలను అపూర్వ రీతిలో విస్తరించారు. కుటుంబాలకు ఉచితంగా మిక్సర్లు, గ్రైండర్లు, ఫ్యాన్లు, మంగళసూత్రాలకు బంగారం, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, పాఠశాల యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు, గ్రామీణ కుటుంబాలకు మేకలు, ఆవులు, నిర్దిష్ట వినియోగ పరిమితి వరకు ఉచిత విద్యుత్‌ను అందించారు.

భారీ వ్యయం..

ఈ విస్తరణకు దీటుగా డీఎంకే ప్రవేశపెట్టిన వివిధ పథకాలు తోడవ్వడంతో, ద్రావిడ ప్రజాకర్షణవాద స్వరూపమే నిర్మాణాత్మక సంస్కరణల నుంచి తక్షణ, స్పష్టమైన వినియోగదారుల సాయానికి మారిపోయిందని పరిశీలకులు పేర్కొంటున్నారు. సంక్షేమ వ్యయం ఇప్పటికే ఏటా సుమారు రూ. 45,000-50,000 కోట్లు ఖర్చవుతోందని ఆర్థికవేత్తలు, విశ్లేషకులు సూచిస్తున్నారు.
కొత్త వాగ్దానాలు కూడా దీనికి జతచేస్తుండటం వల్ల ఈ భారం మరింత పెరగుతోంది. వీటిని అమలు చేయడం వల్ల రాబడి తగ్గితే వీటిని అమలు చేయలేక, ముందుకు వెళ్లలేక ప్రభుత్వాలు, పార్టీలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి.
Read More
Next Story