x

రేవంత్ ప్రభుత్వం డబుల్ గేమ్ ఆడుతోందా ?

తమకు రాతపూర్వకమైన ఆదేశాలు ప్రభుత్వం నుండి అందలేదని సబ్ రిజిస్ట్రార్లు చెప్పటంతో యజమానులకు షాక్ తగిలినట్లవుతోంది.


తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల చట్టంపై వివాదం రోజురోజుకు పెరిగిపోతోంది. సమస్య పరిష్కారం కోసం అధికారులకు అన్నీ ఆదేశాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి, రెవిన్యు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పదేపదే ప్రకటిస్తున్నారు. అయితే తమకు రాతపూర్వకమైన ఆదేశాలు ప్రభుత్వం నుండి అందలేదని సబ్ రిజిస్ట్రార్లు చెప్పటంతో యజమానులకు షాక్ తగిలినట్లవుతోంది.

దీంతో సమస్య పరిష్కారం విషయంలో ప్రభుత్వం డబుల్ గేమ్ ఆడుతోందా అనే అనుమానాలు జనాల్లో పెరిగిపోతున్నాయి. విషయం ఏమిటంటే 22 ఏ నిషేధిత భూ చట్టం నుండి జనాలకు ఉపసమనం కలిగించటంలో భాగంగా రెవిన్యుశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక విషయం చెప్పారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, మున్సిపాలిటీల నుండి చట్టబద్దంగా అనుమతులు పొందిన లేఅవుట్లు, భవనాలు, అపార్ట్ మెంట్లు, ఇళ్ళు, ఓపెన్ ప్లాట్లను 22ఏ నిషేధిత భూముల చట్టం నుండి మినహాయిస్తున్నట్లు తెలిపారు.

పై కేటగిరీలకు చెందిన ఓనర్లు తాము పొందిన అనుమతులను చూపితే రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లు ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేస్తారని స్పష్టంగా చెప్పారు. అయితే రిజిస్ట్రార్లు మంత్రి ఆదేశాలను ఏమాత్రం లెక్కచేయటంలేదు. కారణం ఏమిటంటే మంత్రి ఉత్త ప్రకటన చేసినంతమాత్రాన కుదరదని, తమ కార్యాలయాలకు రాతపూర్వకమైన ఆదేశాలు వస్తే కాని తాము రిజిస్టర్ చేయమని తెగేసి చెబుతున్నారు.

దాంతో 22ఏ నిషేధిత భూముల చట్టం సమస్యలు మళ్ళీ మొదటికి వచ్చాయి. దీంతో జనాలందరు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారు. 2017-25 మధ్య 22ఏ నిషేధిత చట్టానికి వ్యతిరేకంగా హైకోర్టులో సుమారుగా 29 వేల కేసులు దాఖలయ్యాయి. 22ఏ నిషేధిత చట్టంలో సుమారు 4 లక్షల ప్రైవేటు ఆస్తులు ఇరుక్కుపోయి అవసరాలకు అమ్ముకునేందుకు లేకుండా లక్షలాది మంది జనాలు ఆస్తులు అమ్ముకోలేక నానా అవస్తలు పడుతున్నా ప్రభుత్వానికి మాత్రం పట్టడంలేదు. ఇక్కడే ప్రభుత్వం డబుల్ గేమ్ ఆడుతోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

Read More
Next Story