జీవన్‌రెడ్డి కీలక నిర్ణయం
x
Jeevan reddy and Bomma Mahesh

జీవన్‌రెడ్డి కీలక నిర్ణయం

తనకు పార్టీలో జరిగిన అన్యాయం, నిరాధరణ, తాను పార్టీకి 40 ఏళ్ళుగా చేసిన సేవలను జీవన్ రెడ్డి గ్రామాలబాటలో వివరించబోతున్నారు


కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత తొందరలోనే జీవన్ రెడ్డి గ్రామాల బాట పట్టనున్నారు. తనకు పార్టీలో జరిగిన అన్యాయం, నిరాధరణ, తాను పార్టీకి 40 ఏళ్ళుగా చేసిన సేవలను జీవన్ రెడ్డి గ్రామాలబాటలో వివరించబోతున్నారు. తన భవిష్యత్తుపై మాజీమంత్రి ప్రజల నుండి సూచనలు, సలహాలు తీసుకోబోతున్నారు. నిజానికి తాను ఏ పార్టీలో చేరాలనే విషయంలో జీవన్ ఇప్పటికే నిర్ణయం తీసుకునే ఉంటారనటంలో సందేహంలేదు. ఎందుకంటే బీఆర్ఎస్, బీజేపీల్లో చేరాలని పై పార్టీల నేతల నుండి జీవన్ కు పదేపదే ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు ఉండకూడదు అన్న ఉద్దేశ్యంతోనే ప్రజల కోరిక, సూచనల మేరకే తాను పలానా పార్టీలో చేరాను అని చెప్పుకోవటమే జీవన్ రెడ్డి ఉద్దేశ్యంగా కనబడుతోంది. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

కాంగ్రెస్‌పార్టీలో మాజీమంత్రి టీ జీవన్‌రెడ్డి టెన్షన్ పెరిగిపోతోంది. కారణం ఏమిటంటే రేపు అంటే బుధవారం జగిత్యాలలోని ఒక ఫంక్షన్ హాలులో తన మద్దతుదారులతో జీవన్ కీలకమైన భేటీ నిర్వహించారు. ఆ సమావేశంలో జీవన్ తన రాజీనామాను ప్రకటించబోతున్నారు. ఈ విషయాన్ని జీవన్ ఇప్పటికే చెప్పారు. అయితే ఇక్కడ సమస్య జీవన్ రాజీనామాకాదు జీవన్‌తో పాటు నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు ఎంతమంది పార్టీని వదిలేయబోతున్నారు అన్నదే అసలైన పాయింట్. ఈ పాయింట్ లోనే కాంగ్రెస్ పెద్దలు బాగా టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే తొందరలోనే పరిషత్ ఎన్నికలు రాబోతున్నాయి. జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గం మొత్తంమీద జీవన్ దెబ్బపడుతుందనే టెన్షన్ పార్టీలో పెరిగిపోతోంది.

కాంగ్రెస్ లో పెరిగిపోతున్న జీవన్ రెడ్డి టెన్షన్

ఎలాగైనాసరే పార్టీకి రాజీనామాచేయకుండా జీవన్‌ను ఆపాలని విశ్వప్రయత్నాలు జరుగుతున్నా ఎలాంటి ఉపయోగం కనబడటంలేదు. ఇప్పటికే ముగ్గురుమంత్రులు, నలుగురు ఎంఎల్ఏలు జీవన్‌తో భేటీ అయి పార్టీలో కొనసాగే విషయమై చర్చించారు. మంగళవారం ఇదే విషయమై పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ప్రతినిధి సచిన్ సావంత్, విప్, వేములవాడ ఎంఎల్ఏ ఆది శ్రీనివాస్ తదితరులు దాదాపు గంటసేపు భేటీఅయ్యారు. అయినా జీవన్ మాత్రం తన పట్టువీడలేదు.

బొమ్మతో భేటీ తర్వాత జీవన్ మీడియాతో మాట్లాడుతు తాను పార్టీకి రాజీనామా చేసే విషయంలో పునరాలోచించేది ఏమీ లేదన్నారు. అలాగే తాను పార్టీముందు ఎలాంటి డిమాండ్లు పెట్టలేదని, తన డిమాండ్లను పరిష్కరించే స్ధితిలో పీసీసీ లేదని జీవన్ అన్నారు. తనతోపాటు ఎంతమంది పార్టీలోనుండి బయటకు వస్తారనే విషయం బుధవారం సమావేశంలోనే తెలుస్తుందని మాజీమంత్రి చెప్పారు. జీవన్ ఈ ప్రకటనతోనే పార్టీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. పార్టీకి రాజీనామా చేయబోయే జీవన్ రెడ్డి ఒక్కరే వెళ్ళరని అందరికీ తెలిసిందే. కాకపోతే జీవన్‌కు మద్దతుగా ఎంతమంది కాంగ్రెస్‌కు రాజీనామాలుచేసి బయటకు వెళతారనే విషయాన్ని ఇపుడు పార్టీ నిశితంగా గమనిస్తోంది. మరి బుధవారం జీవన్ నిర్వహించబోయే సమావేశానికి ఎంతమంది హాజరవుతారు, ఎంతమంది రాజీనామాలు చేస్తారన్నది ఆసక్తిగా మారింది.

Read More
Next Story