కేసీఆర్‌ను కలిసిన జీవన్ రెడ్డి..
x

కేసీఆర్‌ను కలిసిన జీవన్ రెడ్డి..


బీఆర్ఎస్ పెద్దసారు కేసీఆర్‌ను తమ్ముడు జీవన్ రెడ్డి శుక్రవారం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలో చేరడంపై జీవన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. గులాబీ దండుతో కలిసి పనిచేయడం తన అదృష్టమని జీవన్ రెడ్డి తెలిపారు. ఫామ్‌హౌస్‌కు వచ్చిన జీవన్ రెడ్డిని కేసీఆర్.. శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి తన భావాలను వ్యక్తం చేస్తూ, తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని భావించినట్లు తెలిపారు. చాలా కాలం తర్వాత మళ్లీ కలిసి పనిచేసే అవకాశం రావడం తనకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ మాటలు చెప్పేటప్పుడు ఆయన భావోద్వేగానికి లోనైనట్లు తెలిసింది.

ఈ సందర్బంగానే.. ‘అన్నా మీతో కలిసి పనిచేయమని ఆ దేవుడే పంపించాడన్నా. చాలా గ్యాప్ తర్వాత ఇన్నాల్లకైనా మీతో కలిసిపనిచేసే అవకాశం రావడం సంతోషంగా వుంది అన్నా’ అని జీవన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. అయితే జీవన్ రెడ్డి.. బీఆర్ఎస్‌లో చేరడం తీవ్ర రాజకీయ చర్చలకు దారితీస్తోంది. జీవన్ రెడ్డి వల్ల బీఆర్ఎస్‌కు ఏంటి లాభం? ఈ వయసులో జీవన్ రెడ్డికి ఇవి అవసరమా? అంటూ ప్రజలు అనేక రకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాత్రం జీవన్ రెడ్డి చేరికను స్వాగతిస్తున్నాయి.

Read More
Next Story