
కారు ఎక్కనున్న జీవన్ రెడ్డి.. ముహూర్తం ఫిక్స్ ?
మాజీ మంత్రి, జగిత్యాల నేత జీవన్ రెడ్డి రాజకీయ భవితవ్యంపై క్లారిటీ వచ్చింది. కాంగ్రెస్ వీడిన ఆయన బీఆర్ఎస్ కండువా కప్పుకోవడానికి రెడీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి గుడ్‌బై చెప్పినప్పటి నుంచి ఆయన ఏ పార్టీలో చేరతారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అంతేకాకుండా అనేక ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే ఆయన మాత్రం గులాబీ కారు ఎక్కడానికి సిద్ధమయ్యారు. తన చేరికకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఏప్రిల్ 13న గులాబీ కండవా కప్పుకోనున్నట్లు సమాచారం. జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా అదే రోజున జగిత్యాలలో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ భావిస్తోందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడం కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏప్రిల్ 7న జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లనున్నారు. అక్కడ ఆయనను కలిసి, పార్టీలో ఆహ్వానిస్తారని, ఆ తర్వాత 13వ తేదీన ఆయనకు కండువా కప్పి పార్టీలోకి చేర్చుకుంటారని సమాచారం.

