
‘జైలు జగమొండిగా మార్చేసింది’
అవసరం అయితే కేసీఆర్ నే తమపార్టీలోకి ఆహ్వానిస్తామని ప్రకటించారు
తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కూతురు, బీఆర్ఎస్ నుండి గెంటివేతకు గురైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బంపర్ ఆఫర్ పంపారు. ఇంతకీ ఆ బంపరాఫర్ ఏమిటంటే కేసీఆర్ ను తమపార్టీలో చేరాలని. తాను ఎట్టి పరిస్ధితుల్లోను బీఆర్ఎస్ లో చేరే ప్రసక్తేలేదన్నారు. అవసరం అయితే కేసీఆర్ నే తమపార్టీలోకి ఆహ్వానిస్తామని ప్రకటించారు. రాజకీయంగా డాడీ, మోడీ, రేవంత్ రెడ్డి తనకు ప్రత్యర్ధులు అని తేల్చిచెప్పారు.
తాను కేసీఆర్ కు రాసిన లేఖ లీకైన దగ్గర నుండి ఇప్పటివరకు తండ్రితో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కూడా మాట్లాడలేదన్నారు. తల్లితో మాత్రమే ఎమోషనల్ గా మాట్లాడుతున్నాను అని క్లారిటి ఇచ్చారు. 2022 మేనెలలో తనపైన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసు నమోదైనప్పటినుండి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. తనకు పార్టీనుండి ఎవరిమద్దతు దొరకలేదన్న విషయం చాలా బాధించినట్లు తెలిపారు.
జైలు జీవితం తనను జగమొండిగా మార్చేసినట్లు చెప్పారు. ఇందుకు కారణమైనవారు తప్పకుండా అంతకంతా అనుభవిస్తారని శాపనార్ధాలు పెట్టారు. ఎవరిని ఉద్దేశించి ఈ మాటన్నారో అర్ధంకావటంలేదు. రాజకీయాల్లో తనకు శతృవులు ఎవరన్నది ముఖ్యంకాదని, మనకు నష్టం చేస్తున్నది ఎవరు అన్న విషయాన్ని గుర్తించాలన్నారు. డాడీ, మోడీ, రేవంత్ తో కొట్లాడాలంటే వాళ్ళు శతృవులా కాదా అన్నది కాదు ప్రత్యర్ధులు అన్నదే ముఖ్యమన్నారు. తమ పార్టీ నిలబడాలంటే ప్రత్యర్ధులతో కొట్లాడాల్సిందే కదా అని కవిత అన్నారు.

