
దీక్ష విరమించిన కవిత.. రాహుల్ గాంధీకి సూటి ప్రశ్న
ఖమ్మం వెలుగుమట్ల బాధితుల కోసం చేపట్టిన నిరాహార దీక్షను కవిత విరమించారు. జస్టిస్ ఈశ్వరయ్య నిమ్మరసం ఇచ్చి దీక్ష ముగించారు.
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో పేదల ఇళ్ల కూల్చడానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరవధిక సమ్మెను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విరమించుకున్నారు. రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఈశ్వరయ్య.. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కవిత సూటి ప్రశ్న వేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం భూ యజమానులకు ఎందుకు కాలీ చేయించింది? అని ప్రశ్నించారు. అంతేకాకుండా పేదల ఇళ్లను కూల్చే ధైర్యం మీ ప్రభుత్వానికి ఎక్కడిది? అంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ ప్రాపర్టీలోకి ప్రవేశించే ధైర్యం ఈ సర్కార్ ఎలా చేసింది? అంటూ కవిత మండిపడ్డారు.
‘‘అంతేకాకుండా ప్రజల ముందు ప్రపంచమంతా చూస్తున్నా మీ మంత్రులు పచ్చి అబబద్ధాలు ఎలా చెప్తున్నా? ఒకవైపు మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం పేదలను ఇంత నష్టం చేస్తున్నప్పుడు మీరు చెతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని తిరగడం వెనక అర్థం ఏముంది? మీకు రాజ్యంగం ఒక ఆభరణంలా మారింది’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కవిత.
పాలించే సత్తా మీ ప్రభుత్వానికి లేకపోతే వెంటనే అధికారం నుంచి దిగిపోవాలని కవిత డిమాండ్ చేశారు. దాంతో పాటుగా ప్రజలను క్షమాపన కోరాలని, ఖమ్మంలో జరిగింది చిన్న విషయం కాదని ఆమె వ్యాఖ్యానించారు. ‘‘ఈ విషయంలో మీ ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకోకపోయినా, రాజ్యాంగంపై మీకు గౌరవం ఉందన్న భావన తెలంగాణ ప్రజలకు కలిగించడంలో విఫలమయినా ఇలాంటి మరిన్ని ఘటనలను మీరు చూడాల్సి వస్తుంది’’ అని హెచ్చరించారు. రాహుల్ గాంధీ.. తెలంగాణ ప్రభుత్వంపై ఆధారపడి ఉన్నారని, అది తామూ అర్థం చేసుకున్నామని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కానీ తెలంగాణ ప్రజలకు ఇలా ట్రీట్ చేస్తూ తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
ఖమ్మంలో మొదలైన నిరాహార దీక్ష
వెలుగుమట్లలో పేదల ఇళ్లు కూల్చివేత ఘటన తర్వాత బాధితులకు మద్దతుగా కవిత సోమవారం రాత్రి ఖమ్మంలో నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. కూల్చివేసిన చోటే ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించాలని ఆమె డిమాండ్ చేశారు. ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ కూడా ఈ దీక్షలో పాల్గొన్నారు. దీక్ష ప్రారంభమైన వెంటనే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని కవితను అక్కడి నుంచి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను హైదరాబాద్‌కు తరలించారు.
హైదరాబాద్‌లో కొనసాగిన నిరసన
ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు తరలించిన తర్వాత కూడా కవిత తన నిరసనను కొనసాగించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో దీక్షను కొనసాగిస్తూ వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలపై ఆమె తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చివేయడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. ప్రజల హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వమే ఇలాంటి చర్యలు తీసుకోవడం ఆందోళనకరమని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగ ప్రతిని తీసుకెళ్లడం కేవలం అలంకారంగా ఉండకూడదని, దాని ఆత్మను ఆచరించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. ఖమ్మంలో జరిగిన ఘటన చిన్న విషయం కాదని, ఇది చాలా పెద్ద సమస్యగా మారిందని కూడా ఆమె వ్యాఖ్యానించారు.
జస్టిస్ ఈశ్వరయ్య చేతుల మీదుగా దీక్ష ముగింపు
కొన్ని రోజులుగా కొనసాగిన ఈ నిరాహార దీక్ష బుధవారం సాయంత్రం ముగిసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య నిమ్మరసం ఇచ్చి కవిత, విశారదన్ మహరాజ్‌లతో దీక్ష విరమింపజేశారు.
ఖమ్మం వెలుగుమట్ల ప్రాంతంలో పేదల ఇళ్ల కూల్చివేతతో ప్రారంభమైన వివాదం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్లు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలపై అందరి దృష్టి నిలిచింది.

