రాజీనామాపై జీవన్ కీలక అప్ డేట్
x
Jeevan Reddy

రాజీనామాపై జీవన్ కీలక అప్ డేట్

20 నెలలుగా మానసిక క్షోభకు గురవుతున్న తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేనని చెప్పారు


కొద్దిరోజులుగా టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిన కాంగ్రెస్ సీనియర్ నేత టీ జీవన్ రెడ్డి ఆదివారం ఒక అప్ డేట్ ఇచ్చారు. అదేమిటంటే 20 నెలలుగా మానసిక క్షోభకు గురవుతున్న తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేనని చెప్పారు. ఈమేరకు జీవన్ రెడ్డి ఒక లేఖను విడుదలచేశారు. అవమానాలు భరిస్తు తాను పార్టీలో కొనసాగలేనని స్పష్టంచేశారు. జగిత్యాలలోని ఫంక్షన్ హాలులో ఈనెల 25వ తేదీన తన మద్దతుదారులు, స్ధానిక నేతలతో సమావేశమవుతున్నట్లు లేఖలో తెలిపారు. తన భవిష్యత్ కార్యాచరణపై అందరు సలహాలు ఇవ్వాలని కోరారు. తన రాజకీయ ప్రస్ధానంలో తోడు, మార్గదర్శనం కావాలని మద్దతుదారులతో పాటు జనాలను లేఖలో జీవన్ రెడ్డి కోరారు.


తాజా లేఖతో కాంగ్రెస్ పార్టీకి ఈనెల 25వ తేదీన రాజీనామా చేయటం ఖాయమని అర్ధమైపోయింది. రాజీనామాను సమావేశం రోజున ప్రకటించాలని జీవన్ డిసైడ్ అయ్యారు. రాజీనామా చేసిన తర్వాత నియోజకవర్గంలో మాజీమంత్రి పాదయాత్ర చేయబోతున్నట్లు సమాచారం. తన పాదయాత్రలో ప్రజలను కలుస్తు రాజీనామా తర్వాత భవిష్యత్ కార్యాచరణపై సూచనలు, సలహాలు తీసుకోబోతున్నారు. ఆ తర్వాత తాను ఏమి చేయబోతున్నది ఒక మీటింగ్ పెట్టి ప్రకటించాలన్నది జీవన్ ఆలోచనగా తెలుస్తున్నది. 25వ తేదీన ఏమి చెబుతారో చూడాలి.

Read More
Next Story