కవితపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
x

కవితపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

మనసులో ఏముందో తెలీదుకాని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశంలో చెల్లెలు కల్వకుంట్ల కవితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి


మనసులో ఏముందో తెలీదుకాని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశంలో చెల్లెలు కల్వకుంట్ల కవితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మీడియాతో ఆదివారం మాట్లాడుతు ‘‘పిల్లలు తండ్రిని సంతోషపెట్టకపోయినా పర్వాలేదు..కానీ ఏడిపించొద్దు’’ అని అన్నారు. ‘‘ఈ రాజకీయం ఉంటుంది, పోతుంది..కాని ఇతరులను బాధపెట్టే తీరు మంచిదికాదు’’ అని చెప్పారు. ‘‘రాజకీయపార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చు కాని ప్రజల ఆదరణ లేకుంటే వృధానే కదా’’ అని తేల్చేశారు. ‘‘ప్రజలకోణంలో పార్టీ పెడితే తప్పులేదు కాని వ్యక్తిగత సమస్యలతో పార్టీ పెడితే ఎవరూ పట్టించుకోరు’’ అని క్లారిటి ఇచ్చారు. తమకు పొత్తులు కలసి రావని పొత్తులతో పోటీచేసినపుడల్లా ఓడిపోయిన విషయాన్ని కేటీఆర్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇపుడు కేటీఆర్ చేసిన పై వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పిల్లలు తండ్రిని సంతోషపెట్టకపోయినా పర్వాలేదుకాని బాధపెట్టొద్దు అనటంలో అర్ధమేంటి ? కవిత పార్టీ పెట్టడం తండ్రి కేసీఆర్ కు ఇష్టంలేదా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తండ్రిని బాధపెట్టొద్దు అంటే మీడియా సమావేశాల్లో కాని లేదా ఇతర సమావేశాల్లో కూడా కవిత బీఆర్ఎస్ పాలనపై ప్రతిరోజు ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పాలనపైన ఆరోపణలు చేయటం అంటే తనపైన కూతురు కవిత ఆరోపణలు చేస్తున్నట్లుగానే కేసీఆర్ భావిస్తున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మొత్తంమీద కూతురు కవిత వైఖరి కారణంగా కేసీఆర్ బాధపడుతున్నారు అని కేటీఆర్ చెప్పకనే చెప్పినట్లయ్యింది.

అలాగే ఈరాజకీయం ఈరోజుంటుంది, రేపు పోతుంది..ఇతరులను బాధపెట్టడం మంచిదికాదు అనటంలో అర్ధం తనను సోదరి కవిత ఇబ్బంది పెడుతున్నదని చెప్పినట్లే అయ్యింది. ఎందుకంటే కవిత ఆరోపణల్లో డైరెక్టుగా తన్నీరు హరీష్ రావును కొన్నిసార్లు ప్రత్యక్షంగా మరికొన్నిసార్లు పరోక్షంగా కేటీఆర్ వైఖరిని కూడా తప్పుపడుతున్న విషయం తెలిసిందే. అంటే కవిత వైఖరివల్ల తాను బాధపడుతున్నానని కేటీఆర్ చెప్పదలిచారా ? పార్టీలు ఎవరైనా పెట్టచ్చు, ప్రజల ఆదరణ లేకుంటే వృధానే అనటంలో అర్ధమేంటి ? కవిత పార్టీకి జనాదరణ ఉండదని కేటీఆర్ తేల్చేసినట్లే అనిపిస్తోంది.

ప్రజలకోణంలో పార్టీ పెడితే తప్పులేదు కాని వ్యక్తిగత సమస్యలతో పార్టీపెడితే ఎవరూ పట్టించుకోరు అనటంలో కూడా కవితను ఎత్తిపొడుస్తున్నట్లే ఉంది. ఎలాగంటే బీఆర్ఎస్ లో హరీష్, సంతోష్, కేటీఆర్ తో పడని కారణంగానే ఆమెను పార్టీలో నుండి బయటకు గెంటేశారని అందరికీ తెలుసు. తనను పార్టీలో నుండి బయటకు తరిమేసిన తర్వాతే కవిత సొంతపార్టీని ఏర్పాటుచేశారు. కాబట్టి కవిత పార్టీ పెట్టింది ప్రజలను ఉద్దరించటనికి కాదు సొంత పంచాయితీని సెటిల్ చేసుకోవటం కోసమే అని కేటీఆర్ పరోక్షంగా చెప్పినట్లయ్యింది. కవిత వ్యక్తిగత కారణాలతో పార్టీ పెట్టారు కాబట్టే ప్రజలు పట్టించుకోరు అని కేటీఆర్ జోస్యం చెప్పినట్లయ్యింది. ఏదేమైనా కవితను ఉద్దేశించి కేటీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Read More
Next Story