లీకైన కవిత కొత్తపార్టీ పేరు
x
Kalvakuntla Kavitha

లీకైన కవిత కొత్తపార్టీ పేరు

కవిత తరపున వాదనలు వినిపించిన లాయర్ తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో కవిత కొత్త రాజకీయపార్టీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పాల్సొచ్చింది.


కల్వకుంట్ల కవిత ఏర్పాటుచేయాలని అనుకుంటున్న కొత్త రాజకీయపార్టీ పేరు లీకైంది. మంచి ముహూర్తం చూసుకుని కొత్తపార్టీ పేరును ప్రకటించాలని కవిత అనుకున్నారు. ఈవిషయాన్ని కవితే ఆమధ్య మీడియా సమావేశంలో ప్రకటించారు. మంచి ముహూర్తంచూసుకుని కొత్తపార్టీ పేరును తానే ప్రకటిస్తానని చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. అయితే టెక్నికల్ అంశం కారణంగా కొత్తపార్టీ పేరు బయటకు లైకపోయింది. ఈ టెక్నికల్ అంశం ఏమిటంటే కోర్టులో విచారణ జరగటం.

‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో కొత్తపార్టీని కవిత ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ చేయించారు. జనవరి 23వ తేదీన పార్టీ పేరును రిజిస్టర్ చేయాలని దరఖాస్తు చేశారు. ప్రజాప్రాతినిధ్యచట్టం-1951 లోని సెక్షన్ 29ఎ కింద రాజకీయపార్టీ నమోదు కోసం చేసిన దరఖాస్తును కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలించి వేగంగా నిర్ణయాన్ని ప్రకటించేలా చూడాలని కవిత ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. ఎన్నికల సంఘంపై కవిత ఎందుకు కేసు వేశారంటే తన దరఖాస్తులో చాలా లోపాలు ఉన్నాయని కవితకు ఎన్నికల సంఘం సమాచారం ఇచ్చింది.

ఎన్నికల సంఘం సమాచారం ప్రకారం పార్టీ తరపున లాయర్లు ఢిల్లీకి వెళ్ళి సంబంధిత అధికారులతో సమావేశమై దరఖాస్తులోని లోపాలను సరిచేసి మళ్ళీ ఫ్రెష్ గా దరఖాస్తును అందిస్తే సరిపోతుంది. దరఖాస్తులో ఉన్న లోపాలు ఏమిటో ? వాటిని కవిత సరిచేశారో లేదో కూడా తెలీటంలేదు. అయితే దరఖాస్తు, సమాచారం ఇవ్వటం, సరిదిద్దుకునే విషయంలో ఏమైందో తెలీదుకాని ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కవిత ఏకంగా ఢిల్లీ హైకోర్టులో కేసువేశారు. అంతే తన దరఖాస్తును ఆమోదించే విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉద్దేశ్యపూర్వకంగా జాప్యం చేస్తున్నారనే అనుమానం కవితకు వచ్చుండాలి. అందుకనే కోర్టులో కేసు వేశారు.

కోర్టులో కేసు దాఖలు చేసిన తర్వాత దరఖాస్తులో కొత్తపార్టీ పేరును కూడా కవిత తరపు లాయర్ ప్రస్తావించాలి కదా. సరిగ్గా ఇపుడు కోర్టు విచారణలో అదే జరిగింది. కవిత తరపున వాదనలు వినిపించిన లాయర్ తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో కవిత కొత్త రాజకీయపార్టీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు లాయర్ చెప్పాల్సొచ్చింది. దాంతో కవిత ఏర్పాటు చేయబోతున్న కొత్తపార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి అన్న విషయం వెలుగులోకి వచ్చింది. అంటే కొత్త రాజకీయపార్టీ పేరును కవిత ప్రకటించకుండానే లీకైపోయి మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

Read More
Next Story