
‘‘గొగొయ్ కు పాక్ తో సంబంధాల కేసు కేంద్రానికి బదిలీ’’
హిమాంత బిశ్వ శర్మ ప్రకటన
కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ పాకిస్తాన్ సంబంధాల కేసును హోం మంత్రిత్వ శాఖకు అప్పగించాలని అస్సాం క్యాబినెట్ నిర్ణయించిందని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ శనివారం తెలిపారు.
ఈ కేసులో "ముగ్గురు కీలక పాత్రధారులు" ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఒక ఎంపీ, అతని బ్రిటిష్ భార్య, పాకిస్తాన్ జాతీయుడు అలీ తౌకీర్ షేక్ తో కీలక సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ అంశాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కి పంపుతున్నామని వెల్లడించారు.
క్యాబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించిన తర్వాత విలేకరుల సమావేశంలో శర్మ మాట్లాడారు. "బ్రిటిష్ పౌరుడు, ఎంపీతో కలిసి భారత వ్యతిరేక కుట్రపై దర్యాప్తు చేయడానికి అస్సాం ప్రభుత్వం SITని ఏర్పాటు చేసింది. ఈ విషయం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, దానిని కేంద్రం హోంమంత్రిత్వ శాఖకి అప్పగించాలని నిర్ణయించాము" అని పేర్కొన్నారు.
"SIT నివేదిక, దర్యాప్తు నిర్వహించిన దాని ఆధారంగా నమోదు చేయబడిన కేసును హోంశాఖకి పంపబడుతుంది. దానిని ముందుకు తీసుకెళ్లడానికి దాని దర్యాప్తు సంస్థలలో దేనినైనా ఉపయోగించవచ్చు" అని ఆయన అన్నారు. ఈ కేసు "జాతీయ భద్రతకు సంబంధించినది. ఇది వ్యక్తిగతమైనది కాదు, ముగ్గురు ఆటగాళ్ల ప్రమేయం ఉంది" అని మంత్రివర్గం అభిప్రాయపడిందని ముఖ్యమంత్రి అన్నారు.
వాటిని బయటపెడతాం..
పాకిస్తాన్ ఐఎస్ఐతో గౌరవ్ గొగోయ్ భార్యకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అస్సాం ముఖ్యమంత్రి చాలాకాలంగా ఆరోపిస్తున్నారు. దేశ అంతర్గత వ్యవహారాల్లో గొగోయ్ బ్రిటిష్ భార్య ఎలిజబెత్ కోల్బర్న్‌తో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. గోగోయ్ కి కూడా సమాధానం ఇవ్వడానికి ఇదే తేదీని కేటాయించారు. అయితే అవాంతరాల తరువాత సిట్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
కేబినెట్‌లో చర్చ తర్వాత ఫిబ్రవరి 8న SIT ఫలితాలను బహిరంగపరుస్తామని శర్మ చెప్పారు. సమావేశం తర్వాత, ఆదివారం "గోప్యత లేని సమాచారాన్ని విలేకరుల సమావేశంలో వెల్లడిస్తామని", మంత్రివర్గం ఆయనకు అలా చేయడానికి అధికారం ఇస్తుందని శర్మ చెప్పారు.
జాతీయ దర్యాప్తు సంస్థల ప్రమేయం కావాలి
కేసు చాలా లోతుగా సాగుతున్న దృష్ట్యా ఇందులో జాతీయ దర్యాప్తు సంస్థల జోక్యం అవసరం అని అస్సాం సీఎం అన్నారు. "మా దర్యాప్తులో మాకు పరిమితులు ఉన్నాయి. అయినప్పటికీ, ఈ పరిమితుల్లో, మేము సేకరించినది చాలా ముఖ్యమైనది.
అది NIA లేదా IB లేదా CBIకి చేరుకున్నప్పుడు, వారు దానిని ముందుకు తీసుకెళ్తారు," అని ఆయన అన్నారు. “మేము చేసింది కేవలం 10 శాతం మాత్రమే, 90 శాతం ఇంకా దొరకలేదు” అని శర్మ పేర్కొన్నారు.
గౌరవ్ గొగోయ్ పేరు చెప్పకుండానే ఒక ఎంపీ తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పాకిస్తాన్ ను రహస్యంగా సందర్శించారని చెప్పగలని సీఎం అన్నారు. అలాగే ఇందులో మతమార్పిడి కోణం కూడా ఉందని అయితే సున్నితమైన సమాచారం ఇందులో ఉండటంతో వెల్లడించడం వీలుకాదని తెలిపారు.
"ఇంటర్‌పోల్ నుంచి సహాయం అవసరం. కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ నుంచి సున్నితమైన సమాచారం అవసరం. అందువల్ల, కేసును కేంద్ర హోంశాఖ ఎంపిక చేసిన జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించాలని నిర్ణయించారు," అని శర్మ అన్నారు. 2012 -2016 మధ్య కాలంలో ఆ వ్యక్తులలో ఒకరు పాకిస్తాన్‌కు వెళ్లినట్లు "రుజువు ఉంది" అని శర్మ మరోసారి చెప్పారు.
కానీ అస్సాం పోలీసులు టెలిఫోన్ ఆధారాలను సేకరించలేరు, "దీనిని కేంద్ర సంస్థ చేయవచ్చు". "అసోం ప్రభుత్వం చాలా మంచి దర్యాప్తు నిర్వహించింది. కానీ, విదేశీ పౌరులు కూడా ఇందులో ఉన్న అది సరిపోదు" అని ఆయన అన్నారు.
Next Story

