
తెలంగాణ రాజకీయ పార్టీల్లో మునిసిపల్ ఎన్నికల టెన్షన్!
తెలంగాణ రాజకీయ పార్టీల్లో మునిసిపల్ ఎన్నికల టెన్షన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే, మునిసిపల్ ఎన్నికలు ప్రజల మూడ్‌ను నేరుగా చూపిస్తాయి. పట్టణాల్లో ఓటింగ్ ట్రెండ్ మారితే రాజకీయ సమీకరణలే మారిపోతాయి. సింపుల్‌గా చెప్పాలంటే, మునిసిపల్ ఎన్నికలు చిన్నవిగా కనిపించినా, రాజకీయంగా చాలా పెద్ద సిగ్నల్స్ ఇస్తాయి. అందుకే పార్టీలన్నీ టెన్షన్‌గా ఉన్నాయి. పట్టణాలలో అత్యధికంగా నివసిస్తున్న ఓటర్లలో ఎక్కువ శాతం ఉన్న ఉద్యోగులు, పెన్షనర్స్, నిరుద్యోగులు, మధ్యతరగతి వర్గం. మున్సిపాలిటీ లలో డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు, ఆస్తి పన్నులు,ట్రాఫిక్ సమస్యలు వంటివి ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేయనున్నాయి. అలాగే అభ్యర్థి వ్యక్తిగత ప్రతిష్ఠ,స్థానికంగా చేసిన సేవలు వార్డు స్థాయిలో నాయకత్వం కూడా కీలక పాత్ర పోషించనున్నాయి.
Next Story

