తెలంగాణను అవమానించిన మోదీ
దేశం మొత్తానికి మోదీ ప్రధానమంత్రిగా కాకుండా కేవలం గుజరాత్ కు మాత్రమే పరిమితమైనట్లుగా ఆలోచిస్తున్నట్లు ధ్వజమెత్తిన రేవంత్
తన అమెరికా పర్యటనను అడ్డుకోవటం ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ ప్రజలను అవమానించినట్లు ధ్వజమెత్తిన సీఎం రేవంత్ రెడ్డి. ఇంగ్లాండ్, అమెరికాలో పర్యటించేందుకు చేసుకున్న దరఖాస్తులో ఇంగ్లాండ్ కు అనుమతించిన కేంద్రం అమెరికా పర్యటనకు ఎందుకు అడ్డుకున్నది ? అని సూటిగా ప్రశ్నించిన రేవంత్. ఇంగ్లాండ్, అమెరికా లో తన పర్యటన ఉద్దేశ్యాన్ని స్పష్టంగా చాలా రోజుల క్రితమే కేంద్రానికి తెలియజేసినట్లు చెప్పిన సీఎం
రెండు దేశాల్లో పర్యటన ఉద్దేశ్యం ఒకటే అయినపుడు ఇంగ్లాండ్ పర్యటనకు అనుమతించిన కేంద్రం అమెరికా పర్యటనను అడ్డుకోవటంలో వివక్ష కనబడుతోందని ఆరోపించిన సీఎం. వైబ్రంట్ గుజరాత్ పేరుతో గుజరాత్ సీఎంను అమెరికా, కెనడా పర్యటనకు అనుమతించిన కేంద్రప్రభుత్వం తన అమెరికా పర్యటనను అడ్డుకోవటం ఏమిటని నిలదీసిన సీఎం.
దేశం మొత్తానికి మోదీ ప్రధానమంత్రిగా కాకుండా కేవలం గుజరాత్ కు మాత్రమే పరిమితమైనట్లుగా ఆలోచిస్తున్నట్లు ధ్వజమెత్తిన రేవంత్. మోదీ వైఖరి వల్లే దేశంలో ఫెడరల్ స్పూర్తి దెబ్బతింటోందన్న సీఎం. గుజరాత్, బీజేపీ పాలిత రాష్ట్రాలను ఒకలాగ, బీజేపీయేతర పాలిత రాష్ట్రాలను మరోలాగ మోదీ వివక్షతో చూస్తున్నట్లు ఆరోపించిన సీఎం.

