కేసీఆర్ విచారణకు నోటీసులు, ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం
x
Telephone tapping inquiry on KCR

కేసీఆర్ విచారణకు నోటీసులు, ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం

జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లోని సిట్ కార్యాలయానికి కేసీఆర్ ను పిలిపించాలని మొదట్లో అనుకున్నా తర్వాత ప్లాన్ మార్చుకున్నారు.


టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం చోటు చేసుకున్నది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విచారించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నోటీసులు ఇవ్వాలని గురువారం డిసైడ్ చేసింది. కేసీఆర్ ను వ్యక్తిగతంగా కలిసి నోటీసులు అందించేందుకు సిట్ అధికారులు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు కాసేపట్లో బయలుదేరబోతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ ను సిట్ అధికారులు విచారించబోతున్నట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లోని సిట్ కార్యాలయానికి కేసీఆర్ ను పిలిపించాలని మొదట్లో అనుకున్నా తర్వాత ప్లాన్ మార్చుకున్నారు.

ఎందుకంటే కేసీఆర్ ను సిట్ కార్యాలయానికి పిలిపిస్తే పరిసర ప్రాంతాల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లెమ్ తలెత్తే అవకాశాలున్నాయి. అలాగే కేసీఆర్ ఆనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ ను విచారించాలని అనుకున్నారు. ఇప్పటికే ట్యాపింగ్ కేసులో హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావును సిట్ విచారించిన విషయం తెలిసిందే. కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత, ఆమె భర్త అనీల్ కుమార్ ను కూడా విచారించిన తర్వాత ఫైనల్ గా కేసీఆర్ ను విచారించే యోచనలో సిట్ ఉన్నట్లు ప్రచారంలో ఉంది. అలాంటిది కవిత, అనీల్ కుమార్ కన్నా ముందే కేసీఆర్ ను విచారించాలని సిట్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

కేసీఆర్ హయాంలో వేలాది మొబైల్ ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ జరిగిన విషయం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపింది. వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు, జర్నలిస్టులు, రాజకీయ ప్రత్యర్ధులు, జడ్జాలను కూడా వదలకుండా ట్యాపింగ్ అరాచకానికి తెరలేపారు. చివరకు జడ్జీల కుటుంబసభ్యులను కూడా వదిలిపెట్టలేదు. వీళ్ళందరి ఫోన్లనే కాకుండా కవిత, ఆమె భర్త ఫోన్ ను కూడా ట్యాపింగ్ చేయించటమే కేసీఆర్, కేటీఆర్ లోని అభ్రదతకు నిదర్శనం. ఇన్ని వేల ఫోన్లను మావోయిస్టులు లేదా మావోయిస్టు సింపధైజర్లు అనే ముద్రవేసి ట్యాపింగ్ చేసినట్లు అరెస్టయిన నలుగురు పోలీసు అధికారులు సిట్ విచారణలో బయటపెట్టారు.

అక్రమ ట్యాపింగ్ ఆరోపణలన్నీ కేసీఆర్ మీదనే ఉన్నా ఇందులో కీలకంగా వ్యవహరించిన ఇంటెలిజెన్స్ మాజీ బాస్ టీ ప్రభాకరరావు మాత్రం ఇప్పటివరకు నోరిప్పలేదు. ప్రభాకరరావు గనుక నోరిప్పితే అప్పుడు అరెస్టులు మొదలవుతాయనటంలో సందేహంలేదు. మరి శుక్రవారం సిట్ విచారణ ఎన్నిగంటలకు మొదలవుతుంది ? విచారణలో కేసీఆర్ ఏమి సమాధానాలు చెబుతారు అన్నది ఆసక్తిగా మారింది.

Read More
Next Story