పవన్ కల్యాణ్ పై మొదలైన వ్యతిరేకత
x
Pawan Kalyan

పవన్ కల్యాణ్ పై మొదలైన వ్యతిరేకత

రామచంద్రరావు రిక్వెస్టు మీద ఈనెల 7,8 తేదీల్లో మున్సిపాలిటీల్లో పవన్ పర్యటించబోతున్నారు


జనసేన అధినేత, ఏపీ డిప్యుటి సీఎం పవన్ కల్యాణ్ పై తెలంగాణలో వ్యతిరేకత మొదలైంది. ఈనెల 11వ తేదీన మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ జరగబోతోంది. అందుకని మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం చేసేందుకు(Pawan kalyan) పవన్ ను (Telangana BJP)తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు ఒప్పించారు.

రామచంద్రరావు రిక్వెస్టు మీద ఈనెల 7,8 తేదీల్లో మున్సిపాలిటీల్లో పర్యటించబోతున్నారు. ప్రచారం విషయంలో బీజేపీ రూట్ మ్యాప్ రెడీచేస్తోంది. బీజేపీకి తెలంగాణలో పవన్ ప్రచారం చేయబోతున్నట్లు రామచంద్రరావు తన ట్విట్టర్ ఖాతాలో చెప్పగా జనసేన కూడా దాన్ని నిర్దారిస్తు ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.

వెంటనే కాంగ్రెస్ నుండి పవన్ ప్రచారంపై అభ్యంతరాలు మొదలైపోయాయి. పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతు తెలంగాణపై తీవ్ర వ్యతిరేకత ఉన్న పవన్ బీజేపీకి ప్రచారం చేయటం ఏమిటి ? అని నిలదీశారు.

బీజేపీకి డిపాజిట్లు కూడా రావన్న విషయం అర్ధమవటంతోనే ప్రచారం కోసం సినీనటుడు, ఏపీ డిప్యుటి సీఎం పవన్ తో ప్రచారం చేయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పవన్ ను తెలంగాణ జనాలు ఎట్టి పరిస్ధితుల్లోను నమ్మరుగాక నమ్మరని బొమ్మ చెప్పారు. గతంలో పవన్ తెలంగాణ భాష, యాసను, సంస్కృతిని అవహేళన చేసినట్లు గుర్తుచేశారు.

బీజేపీ ఉనికికే ప్రమాదం వచ్చింది కాబట్టే పవన్ పై ఆధారపడినట్లు తెలిపారు. కాంగ్రెస్ బలోపేతంగా ఉందని, 90శాతం మున్సిపాలిటీల్లో కాంగ్రెస్సే గెలుస్తుందని బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తంచేశారు.

Read More
Next Story