తెలంగాణ విషయంలో పవన్ కీలక నిర్ణయం
x
Pawankalyan with BJP state president Ramachandra Rao and Central Minister Kishan Reddy

తెలంగాణ విషయంలో పవన్ కీలక నిర్ణయం

పవన్ తో వీలైనన్ని మున్సిపాలిటీల్లో ప్రచారం చేయించేందుకు పార్టీ రూట్ మ్యాప్ రెడీ చేస్తోంది


ఈనెల 11వ తేదీన జరగబోతున్న తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యుటి సీఎం పవన్ కల్యాణ్(Pawan kalyan) కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు కోరిక మీద తెలంగాణలో ప్రచారం చేయటానికి అంగీకరించారు. ఈ విషయాన్ని రామచంద్రరావు తన ట్విట్టర్ ఖాతాలో చెప్పారు. ఈనెల 7, 8 తేదీల్లో బీజేపీ(Telangana BJP) అభ్యర్ధులకు మద్దతుగా పవన్ ప్రచారం చేయబోతున్నారు. అయితే ఎన్ని మున్సిపాలిటీల్లో పవన్ ప్రచారం చేస్తారన్న విషయం ఇంకా ఫైనల్ కాలేదు.

పవన్ తో వీలైనన్ని మున్సిపాలిటీల్లో ప్రచారం చేయించేందుకు పార్టీ రూట్ మ్యాప్ రెడీ చేస్తోంది. ఏదేమైనా పవన్ తెలంగాణ బీజేపీకి ప్రచారం చేయటం కీలక పరిణామమనే చెప్పాలి. ఎందుకంటే ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి తెలంగాణలో బీజేపీ నేతలు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ తో అంటీ ముట్టనట్లే ఉన్నారు. పైగా ఏపీలో ఉన్నట్లుగా బీజేపీ, టీడీపీతో పొత్తు ఉండదని కూడా చాలాసార్లు చెప్పారు. తెలంగాణలో టీడీపీ, జనసేనతో తమకు పొత్తు అవసరం లేదని స్వయంగా రామచంద్రరావే చెప్పారు. అలాంటిది ఇపుడు ప్రత్యేకంగా పార్టీ గెలుపుకు పవన్ ను ఎందుకు తీసుకువస్తున్నారు అన్నదే అర్ధంకావటంలేదు.

మున్సిపల్ ఎన్నికల్లో 4 కార్పొరేషన్లు, 50కిపైగా మున్సిపాలిటీలను గెలుచుకోవాలని బీజేపీ టార్గెట్ పెట్టుకున్నది. మరి టార్గెట్ పెట్టుకునేటపుడు గ్రౌండ్ రియాలిటీని గమనించారా అన్నదే అర్ధంకావటంలేదు. రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో పార్టీకి ఏమాత్రం పట్టులేదు. ప్రతి నియోజకవర్గంలోను కనీసం ఒక మున్పిపాలిటీ అయినా ఉంటుంది. అలాంటిది గ్రౌడ్ లెవల్లో సరైన బలం లేకుండానే టార్గెట్ మాత్రం పెట్టేసుకున్నారు రామచంద్రరావు. టార్గెట్ రీచ్ అవ్వాలంటే పవన్ కల్యాణ్ అవసరం తప్పదని అనుకున్నట్లున్నారు. అందుకనే పవన్ ను రిక్వెస్టు చేసి మరీ ప్రచారానికి పిలిపిస్తున్నది.

పవన్ ప్రచారం చేస్తే బీజేపీ గెలిచేస్తుందా ? అన్నది కీలకమైన పాయింట్. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీచేసింది. అభ్యర్ధుల గెలుపుకు పవన్ సుడిగాలి పర్యటన చేశారు. పవన్ ఎంత ప్రచారంచేసినా అభ్యర్ధుల్లో ఒక్కరికి కూడా కనీసం డిపాజిట్ కూడా రాలేదు. ఏపీలో కూటమి గెలిచిన తర్వాత పవన్ తెలంగాణను దాదాపు వదిలేసినట్లే. అందుకనే పార్టీని కూడా పెద్దగా పట్టించుకోవటంలేదు. అలాంటిది పవన్ ప్రచారం చేయటంవల్ల బీజేపీ వచ్చే లాభం ఏమిటన్నది ఆసక్తిగా మారింది.

Read More
Next Story