x

కేసీఆర్, కేటీఆర్ విషయంలో రేవంత్ పెద్ద స్కెచ్చే వేశాడా ?

బీఆర్ఎస్ నేతలపై కేసులు, విచారణల విషయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు అర్ధమవుతోంది


బీఆర్ఎస్ నేతలపై కేసులు, విచారణల విషయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు అర్ధమవుతోంది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి సంబంధించి కేసుల వరకు ఓకే కాని అరెస్టులు చేస్తే సమస్యలు వస్తాయని రేవంత్ అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ తదితరులను అరెస్టులు చేయిస్తే వారిపై సింపథి పెరుగుతుందేమో అనే అనుమానం రేవంత్ లో ఉన్నట్లు సమాచారం.

బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం అవినీతి, టెలిఫోన్ ట్యాపింగ్, ఫార్ములా కార్ ఈ కార్ రేసు అవినీతి, అధికార దుర్వినియోగం, విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో అవినీతి, ధరణి అక్రమాలతో పాటు చాలా అవినీతి జరిగిందని స్వయంగా రేవంతే పదేపదే ఆరోపణలు చేస్తున్నాడు. కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్ళపై రిటైర్డ్ న్యాయమూర్తులతో విచారణలు కూడా జరిపించాడు. కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్ళల్లో కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడినట్లు విచారణలో తేలిందని రేవంతే ఎన్నోసార్లు చెప్పాడు.

టెలిఫోన్ ట్యాపింగ్, ఫార్ములా కార్ రేసు కేసులో అవినీతే కాకుండా అధికార దుర్వినియోగం జరిగినట్లు ఇప్పటికే ఆధారాలతో సహా ఏసీబీ ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చినట్లు సమాచారం. నిజంగానే కేసీఆర్, కేటీఆర్, హరీష్ అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆధారాలతో సహా నివేదికల్లో తేలితే మరి ఇంకా వాళ్ళను రేవంత్ ప్రభుత్వం ఎందుకని అరెస్టులు చేయలేదు ? ఇక్కడే రేవంత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అదేమిటంటే వీళ్ళని అరెస్టులు చేస్తే జనాల్లో సింపథి పెరిగిపోతుందని అంచనా వేశాడు. అందుకనే జస్ట్ కేసులు మాత్రం నమోదుచేసి కల్వకుంట్ల కుటుంబ అధికార దుర్వినియోగం, అవినీతి, అక్రమాలపై జనాల్లో ప్రతిరోజు చర్చలు జరుగుతుండేలా చూడటమే రేవంత్ వ్యూహంగా అర్ధమవుతోంది.

Read More
Next Story