కేసీఆర్ కు  సిట్ బంపర్ ఆఫర్
x
SIT notice to KCR

కేసీఆర్ కు సిట్ బంపర్ ఆఫర్

గురువారం మధ్యాహ్నం నందినగర్ లోని కేసీఆర్ ఇంట్లో ఈమేరకు నోటీసులు జారీచేశారు


‘‘టెలిఫోన్ ట్యాపింగు విచారణ ఎక్కడ జరగాలో మీరే చెప్పండి’’ అని కేసీఆర్ కు సిట్ అధికారులు ఛాయిస్ ఇచ్చారు. టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అధికారులు కేసీఆర్ ను విచారించబోతున్నారు. గురువారం మధ్యాహ్నం నందినగర్ లోని కేసీఆర్ ఇంట్లో ఈమేరకు నోటీసులు జారీచేశారు. కేసీఆర్ పీఏ సిట్ అధికారుల నుండి నోటీసును అందుకున్నారు. మొదట్లో ఫామ్ హౌస్ కు వెళ్ళి కేసీఆర్ ను కలిసి నోటీసు జారీచేయాలని అధికారులు అనుకున్నా తర్వాత ఎందుకనో రూటుమార్చి నందినగర్ లోని ఇంటికే వెళ్ళి పీఏను కలిసి నోటీసు అందించారు.

విచారణకు హాజరయ్యే విషయంలో సిట్ అధికారులు కేసీఆర్ కే ఛాయిస్ ఇచ్చారు. ఫామ్ హౌస్, నందినగర్ లో ఎక్కడ విచారణకు సౌకర్యంగా ఉంటుందో చెబితే తాము అక్కడికే వచ్చి విచారణ చేస్తామని సిట్ అధికారులు నోటీసులో చెప్పారు. కేసీఆర్ వయసు 65 దాటిన కారణంగా ఇలాంటి వెసులుబాటు ఇచ్చినట్లు సిట్ చెప్పింది. సీఆర్పీసీ 160 కింద కేసీఆర్ కు సిట్ నోటీసు జారీచేసింది. కేసీఆర్ రాదలచుకుంటే జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లోని సిట్ కార్యాలయానికి కూడా రావచ్చనే బంపర్ కూడా ఆఫర్ ఇచ్చింది. విచారణ ఎక్కడ జరిగినా శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సిద్దంగా ఉండాలని నోటీసులో సిట్ స్పష్టంచేసింది.

నోటీసులో పేర్కొన్నట్లుగా విచారణకు ఎక్కడ హాజరయ్యేది కేసీఆరే చెప్పాలి. కేసీఆర్ కోరుకున్న చోటనే విచారణకు సిట్ అధికారులు రెడీ అని చెప్పటం అంటే మాజీ ముఖ్యమంత్రి అన్న మర్యాదను సిట్ ఇచ్చినట్లే అనుకోవాలి. మరి విచారణ ఎక్కడ జరగాలని కేసీఆర్ కోరుకుంటున్నారో చూడాలి.

Read More
Next Story