కేసీఆర్ కు షాకిచ్చిన సిట్
x
SIT served second notice to KCR

కేసీఆర్ కు షాకిచ్చిన సిట్

ఫిబ్రవరి 1వ తేదీన కేసీఆర్ ను విచారణకు హాజరుకావాలని సిట్ అధికారులు స్పష్టంచేశారు


బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ పెద్ద షాకిచ్చింది. ఇలాంటి షాక్ వస్తుందని బహుశా కేసీఆర్ ఊహించుండరు. ఇంతకీ విషయం ఏమిటంటే టెలిఫోన్ ట్యాపింగు కేసులో శుక్రవారం విచారణకు హాజరవ్వాలన్న నోటీసుకు కుదరదని కేసీఆర్ రిప్లై ఇచ్చిన విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల బిజీలో ఉన్నకారణంగా ఎన్నికల్లోపు విచారణకు హాజరుకాలేనని కేసీఆర్ సిట్ అధికారుల నోటీసుకు సమాధానమిచ్చారు. సమాధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన సిట్ ఉన్నతాధికారులు తాజాగా మరో నోటీసు జారీకి రెడీ అవుతున్నారు.

మున్సిపల్ ఎన్నికలయ్యేంతవరకు విచారణకు రానంటే కుదరదని రెండో నోటీసులో స్పష్టంచేశారు. తాము చెప్పిన తేదీకి విచారణకు హాజరవ్వాల్సిందే అని రెండో నోటీసును సిట్ జారీచేసింది. ఈ నోటీసును కాసేపటిలో నందినగర్ లోని కేసీఆర్ ఇంటికి వెళ్ళి అందచేయబోతోంది. తన రిప్లైకి సిట్ అధికారులు ఓకే చెప్పారని ఉదయం నుండి కేసీఆర్ అండ్ కో అనుకుంటున్నది. ఎందుకంటే కేసీఆర్ రిప్లై పై సిట్ అధికారుల నుండి ఎలాంటి స్పందన కనబడలేదు. అయితే ఏమి జరిగిందో ఏమోకాని సాయంత్రం పొద్దుపోయిన తర్వాత కేసీఆర్ కు రెండో నోటీసును శుక్రవారం రాత్రిలోగానే జారీచేయాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఈమేరకు నోటీసు కూడా రెడీ అయ్యింది.

ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ ను విచారణకు సిద్దంగా ఉండాలని సిట్ అధికారులు స్పష్టంచేశారు. విచారణకు ఎక్కడ హాజరవ్వాలన్నది కేసీఆర్ ఛాయిస్ కే వదిలేశారు. నందినగర్ లోని సొంత ఇంటిలోనే కేసీఆర్ ను విచారించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరీ రెండో నోటీసు విషయంలో కేసీఆర్ అండ్ కో ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Read More
Next Story