స్పీకర్ కు లాస్ట్ ఛాన్స్ ఇచ్చిన సుప్రింకోర్టు
x
Supreme court serious

స్పీకర్ కు లాస్ట్ ఛాన్స్ ఇచ్చిన సుప్రింకోర్టు

రెండువైపుల వాదనలు విన్న ధర్మాసనం విచారణలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తంచేసింది


సుప్రింకోర్టు చాలా సీరియస్ అయిపోయింది. ఇదే చివరి అవకాశమంటు గట్టిగా హెచ్చరించింది. ఇదంతా ఏ విషయంలో అంటే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన 10 మంది ఎంఎల్ఏల విషయంలోనే. శుక్రవారం ఫిరాయింపు ఎంఎల్ఏల అంశాన్ని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ ధర్మాసనం విచారించింది. ప్రభుత్వం తరపున లాయర్ అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తు పదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏల విషయంలో స్పీకర్ ఇప్పటికే 8 మంది విషయంలో తీర్పు ఇచ్చినట్లు చెప్పారు. మున్సిపల్ ఎన్నికల కారణంగానే మిగిలిన ఇద్దరి విషయంలో విచారణ జరపలేకపోయినట్లు తెలిపారు. ఎన్నికల కారణంగానే విచారించేందుకు మరో మూడు వారాల సమయం కావాలని కోరారు.

తర్వాత బీఆర్ఎస్ లాయర్ మోహిత్ రావు వాదనలు వినిపిస్తు పదిమంది ఎంఎల్ఏలు పార్టీ ఫిరాయించినట్లుగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఒక ఎంఎల్ఏ బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీచేసినట్లు చెప్పారు. మరో ఎంఎల్ఏ కూతురు కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీచేసిందన్నారు. కాంగ్రెస్ కు ఓట్లేసి తన కూతురిని గెలిపించాలని సదరు ఎంఎల్ఏ ఎన్నికల ప్రచారం చేసినట్లు తెలిపారు. ఎంఎల్ఏలు పార్టీ మారినట్లు ఇంతకన్నా ఆధారాలు ఏమి కావాలని మోహిత్ రావు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్ళారు. మొదట్లో నాలుగు వారాల గడువు కోరిన స్పీకర్ ఇపుడు మళ్ళీ మూడువారాల గడువు కోరటంపై మోహిత్ తన అభ్యంతరాన్ని వ్యక్తంచేశారు.

రెండువైపుల వాదనలు విన్న ధర్మాసనం విచారణలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. చివరగా మూడువారాల గడువిస్తున్నామని, ఈలోగా తేల్చకపోతే తర్వాత తామే ఎంఎల్ఏల అనర్హత నిర్ణయాన్ని ప్రకటిస్తామని సీరియస్ గా స్పీకర్ ను హెచ్చరించింది. మూడువారాల్లోగా నిర్ణయం ప్రకటించకపోతే స్పీకర్ చర్యలను కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని కూడా వార్నింగ్ ఇచ్చింది. కాబట్టి సుప్రింకోర్టు వార్నింగ్ నేపధ్యంలో ఈనెలాఖరులోగా ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం ప్రకటించే అవకాశముంది.

Read More
Next Story