
తమిళనాడు సీఎం స్టాలిన్
సిద్ధరామయ్యకు కృతజ్ఞతలు తెలిపిన తమిళనాడు సీఎం
ఫెడరలిజం రాజకీయ డిమాండ్ కాదని నిన్న వ్యాఖ్యానించిన సిద్ధరామయ్య
కేంద్ర-రాష్ట్ర సంబంధాలను మెరుగుపరచడంలో తమిళనాడు లో కొలువుదీరిన డీఎంకే ప్రభుత్వం తీసుకున్న చొరవను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించడంపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు.
ఆయనకు ఎక్స్ వేదిక కృతజ్ఞతలు తెలిపారు. ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో ఒక పోస్ట్‌లో, తమిళనాడు చొరవకు సిద్ధరామయ్య 'ఆలోచనాత్మక ఆమోదం', సమాఖ్య పునరుద్ధరణ సమష్టి కృషి అని గుర్తించడం పట్ల తాను ఎంతో అభినందిస్తున్నానని అన్నారు.
తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై ఉన్నత స్థాయి కమిటీ నివేదికలోని భాగం I కి హృదయపూర్వకంగా స్పందించినందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు స్టాలిన్ 'ధన్యవాదాలు' అని తెలియజేశారు.
"మీరు సరిగ్గా గమనించినట్లుగా, భారత్ వంటి వైవిధ్యభరితమైన గణతంత్రంలో ఐక్యత ఏకరూపత ద్వారా కాదు, రాజ్యాంగ విశ్వాసం ద్వారా కొనసాగుతుంది" అని స్టాలిన్ అన్నారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై ఉన్నత స్థాయి కమిటీ నివేదికలోని మొదటి భాగం, తమిళం, ఆంగ్లంలో ఫిబ్రవరి 16, 2026న తమిళనాడు శాసనసభలో ప్రవేశపెట్టారు. నివేదికలోని మొదటి భాగం భాషా విధానం నుంచి గవర్నర్, విద్య, ఆరోగ్యం, సరిహద్దుల విభజన, ఎన్నికలు, GST వంటి పది కీలక అంశాలను కవర్ చేస్తుంది.
ఫెడరలిజం.. రాజకీయ డిమాండ్ కాదు
"సమాఖ్యవాదం రాజకీయ డిమాండ్ కాదు - ఇది మన రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో భాగం. సంవత్సరాలుగా, ఆర్థిక- శాసన విషయాలలో కేంద్రీకరణ పెరుగుతూ మన రాజ్యాంగ నిర్మాతలు ఊహించిన సున్నితమైన సమతుల్యతను దెబ్బతీసింది." అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. స్టాలిన్ కు రాసిన లేఖలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. "భారత్ వంటి ప్రజాస్వామ్య దేశంలో సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో నిర్మాణాత్మకంగా పాల్గొనడానికి కర్ణాటక సిద్ధంగా ఉంది." అన్నారు.
కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై ఉన్నత స్థాయి కమిటీ ఫిబ్రవరి 22, 2026న న్యూఢిల్లీలో సమావేశమైంది, దాని నివేదికలోని రెండవ భాగంపై చర్చించింది. ఈ సమావేశంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చైర్‌పర్సన్ జస్టిస్ కురియన్ జోసెఫ్ సభ్యులు కె అశోక్ వర్ధన్ శెట్టి, ఎం నాగనాథన్ పాల్గొన్నారు. కమిటీ తన నివేదికలోని రెండవ భాగంలో చేర్చాల్సిన వివిధ అంశాలను చర్చించింది. ఇందులో 10 అధ్యాయాలు ఉన్నాయి.
Next Story

