
ఈగల్ టీమ్ అదుపులో టీడీపీ ఎంపీ, బీఆర్ఎస్ మాజీ ఎంఎల్ఏ
పార్టీలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, తాండూరు, బీఆర్ఎస్ మాజీ ఎంఎల్ఏ పైలెట్ రోహిత్ రెడ్డితో పాటు రియల్ ఎస్టేట్ ప్రముఖులున్నారు
మొయినాబాద్ శివార్లలోని ఒక ఫామ్ హౌస్ లో డ్రగ్స పార్టీపై పోలీసులు దాడిచేయటం సంచలనంగా మారింది. దాడిచేయటం సంచలనంగా ఎందుకు మారిందంటే ఆపార్టీలో టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ తాండూరు మాజీ ఎంఎల్ఏ పైలెట్ రోహిత్ రెడ్డి, రాజస్ధాన్ మాజీ ఎంఎల్ఏ తదితర ప్రముఖులుండటమే. పక్కా సమాచారంతో శనివారం రాత్రి సుమారు 9.30 గంటలకు డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో ఈగల్ టీమ్ ఫామ్ హౌస్ మీద దాడచేసింది. మఫ్టీలో ఉన్న పోలీసులను చూడగానే పార్టీలో ఉన్న ఒక వ్యక్తి నాలుగు రౌండ్లు గాలిలో కాల్పులు జరపటం మరింత సంచలనంగా మారింది.
ఇంతకీ విషయం ఏమిటంటే పార్టీలో పెద్దఎత్తున పార్టీ జరగబోతోందని ఈగల్ టీమ్ కు సమాచారం అందింది. అందుకని ఫామ్ హౌస్ పై పోలీసులు గట్టి నిఘాఉంచారు. సమాచారం అందినట్లే శనివారం రాత్రి సుమారు 7 గంటల ప్రాంతంలో కొందరు పెద్ద కార్లలో ఫామ్ హౌస్ లోకి ఎంటరయ్యారు. 2 గంటలు బయటే వెయిట్ చేసిన ఈగల్ టీమ్ సడెన్ గా ఫామ్ హౌస్ మీద దాడిచేసింది. పార్టీలో 11 మంది ఉన్నట్లు గుర్తించింది. పార్టీ దగ్గర కొత్తవాళ్ళను చూడగానే 11మందిలో ఒకవ్యక్తి తన దగ్గర ఉన్న తుపాకీతో గాలిలో కాల్పులు జరిపాడు. దాంతో తాము ఈగల్ టీమ్ పోలీసులమని చెప్పటంతో పార్టీ చేసుకుంటున్న వ్యక్తులు అక్కడినుండి పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు అందుకు అవకాశం ఇవ్వలేదు.
పార్టీలో ఉన్నవారందరినీ అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత వారి వివరాలు తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే పార్టీలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, తాండూరు, బీఆర్ఎస్ మాజీ ఎంఎల్ఏ పైలెట్ రోహిత్ రెడ్డితో పాటు రియల్ ఎస్టేట్ ప్రముఖులున్నారు. అజీజ్ నగర్లో ఉన్న ఈ ఫామ్ హౌసే ఒకపుడు బీఆర్ఎస్ ఎంఎల్ఏల కొనుగోలు అంశంతో అప్పట్లో తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం గుర్తుండే ఉంటుంది.
రోహిత్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, కాల్పులు జరిపిన రాజస్ధాన్ లోని జైపూర్ మాజీ ఎంఎల్ఏ నితీష్ శర్మ, ప్రియాంకరెడ్డి అనే మహిళతో పాటు మరో ఏడుగురు ప్రముఖులున్నట్లు పోలీసులు తెలిపారు. వీరందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు మొయినాబాద్ పోలీసుస్టేషన్ కు తరలించారు. ఇక్కడ విచారణ తర్వాత అందరికీన మెజిస్ట్రేట్ దగ్గరకు తీసుకెళ్ళబోతున్నారు. పట్టబడ్డ 11మందిలో ఆరుగురు కొకైన్ తీసుకున్నట్లు బ్లడ్ టెస్టులో తేలింది. అయితే ఏలూరు ఎంపీ పుట్టాకు నెగిటివ్ వచ్చింది. అంటే పుట్టా డ్రగ్స్ తీసుకోకపోయినా విపరీతంగా మద్యం తీసుకున్నట్లు తేలింది. ఘటన జరిగింది బీఆర్ఎస్ మాజీ ఎంఎల్ఏ ఫామ్ హౌస్ కావటం, పోలీసుల అదుపులో టీడీపీ ఎంపీతో పాటు పలువురు ప్రముఖులు ఉండటంతో ఈ డ్రగ్స్ కేసు సంచలనంగా మారింది.
పార్టీలో పట్టుబడిన వారిలో వ్యాపారస్తుడు కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి తరచూ సిమ్లాకు వెళ్ళొస్తుంటాడు. ఇపుడు కూడా పార్టీలో తీసుకున్న కొకైన్ ను కౌశిక్ సిమ్లానుండే తీసుకొచ్చినట్లు తెలిసింది. పోలీసుల సమాచారం ప్రకారం తమ అదుపులో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎంఎల్ఏ పైలెట్ రోహిత్ రెడ్డి, రాజస్ధాన్ మాజీ ఎంఎల్ఏ నితీష్ శర్మ, వర్గనేని రమేష్, వీ. శ్రవణ్ కుమార్, రితీష్ రెడ్డి, నల్లపునేని విజయకృష్ణ, శ్రీధర్ రెడ్డి, ప్రియాంకరెడ్డి ఉన్నారు. వీరి విషయంలో మెజిస్ట్రేట్ ఏమిచేస్తారో చూడాలి.

