x

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో నలిగిపోతున్న తెలంగాణ

పై రెండు దేశాల మిలిటరీల తరపున తెలంగాణకు సంబంధించిన సుమారు 1200 మంది యుద్ధంలో పాల్గొంటున్నారు


ఎక్కడో రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంటే ఏ సంబంధంలేని తెలంగాణ నలిగిపోతోంది. దీనికి కారణం ఏమిటంటే పై రెండు దేశాల మిలిటరీల తరపున తెలంగాణకు సంబంధించిన సుమారు 1200 మంది యుద్ధంలో పాల్గొంటున్నారు కాబట్టే. వీళ్ళంతా పై రెండు దేశాల మిలిటరీలో సైనికులు కాదు.

టూరిస్ట్ వీసాతో మూడు నెలల ఉపాధికోసం రష్యా, ఉక్రెయిన్ కు వెళ్ళిన వాళ్ళు. రష్యా, ఉక్రెయిన్ లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇప్పిస్తామని, బాగా డబ్బులు సంపాదించుకోవచ్చని కొందరు ఏజెంట్లు చెప్పిన మాటలను నమ్మి లక్షలు ఖర్చులు పెట్టుకుని పై దేశాలకు వెళ్ళి మోసపోయిన వాళ్ళు. తాజాగా నిజామాబాద్ జిల్లాకు చెందిన నలుగురు ఏజెంట్ల ద్వారా ఉపాధి కోసం రష్యాకు వెళ్ళారు. వెంటనే ఈ నలుగురిని రష్యా మిలిటరీ అధికారులు సైన్యంలో చేర్చేసుకుని యుద్ధం చేయమని చెప్పి ఉక్రెయిన్ సరిహద్దులకు పంపించిన విషయం బయటపడింది.

1200 మంది కుటుంబాల్లో ఆందోళనలు పెరిగిపోతున్న కారణంగా తమ వాళ్ళని ఎలాగైనా తిరిగి తెలంగాణకు తెప్పించే ఏర్పాట్లు చేయాలని కుటుంబాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేస్తున్నారు. ఇదే అంశంపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటి మెంబర్ పి. స్వదేశ్ తో ఇంటర్వ్యూ.

Read More
Next Story