
బీజేపీ ఎంపీపై మండిపోతున్న తెలంగాణ
గురువారం పార్లమెంటు సమావేశంలో డీలిమిటేషన్ బిల్లుపై తేజస్వీ మాట్లాడుతు తెలంగాణ విభజననను పాకిస్ధాన్ విభజనతో పోల్చారు
బెంగుళూరు సౌత్ ఎంపీ, బీజేపీ నేత తేజస్వీ సూర్యపై తెలంగాణ మండిపోతోంది. కారణం ఏమిటంటే గురువారం పార్లమెంటు సమావేశంలో డీలిమిటేషన్ బిల్లుపై తేజస్వీ మాట్లాడుతు తెలంగాణ విభజననను పాకిస్ధాన్ విభజనతో పోల్చారు. ‘‘ఏపీ విభజనను కాంగ్రెస్ ప్రభుత్వం బ్రిటీష్ కన్నా చెత్తగా చేసింది’’ అని అన్నారు. ఎంపీ మాటల్లో ఏపీ విభజన చెత్త అన్న అర్ధం వినబడింది. ‘‘నియోజకవర్గాల పునర్విభజనవల్ల తాము సీట్లతో పాటు ప్రభావాన్ని కోల్పోతామనే భావన దక్షిణాది ప్రాంతంలో నెలకొన్నది’’ అని చెప్పారు. అయితే ప్రభుత్వం అన్నీ రాష్ట్రాల వాటాను 50శాతానికి పెంచుతుందన్నారు. ఈ బిల్లు ద్వారా అన్నీ రాష్ట్రాలకు సమాన ప్రయోజనాలు అందుతాయని అన్నారు.
The BJP spits venom against the formation of Telangana yet again!
— KTR (@KTRBRS) April 16, 2026
Likening the Telangana demerger to the India-Pakistan Partition is foolish and deserves strong condemnation.
Telangana was formed due to the protracted struggle and sacrifices of its people.
BJP leaders seem to… pic.twitter.com/jOdyXVgRBN
మిగిలిన వ్యాఖ్యల సంగతి ఎలాగున్నా ఏపీ విభజనను పాకిస్ధాన్ విభజనతో పోల్చినందుకు బీఆర్ఎస్ పార్టీ నేతలు మండిపోతున్నారు. కీలకనేత హరీష్ రావు, మాజీమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతు తెలంగాణను అవమానించినందుకు ఎంపీ తేజస్వీ సూర్య వెంటనే క్షమాపణలు డిమాండ్ చేశారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించినందుకు ఎంపీ వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు.
🔹 తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
— BRS Party (@BRSparty) April 16, 2026
🔹 పార్లమెంట్ సాక్షిగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
తెలంగాణ… pic.twitter.com/yHoCIvlzWr
తెలంగాణ ఆవిర్భావం దశాబ్దాల పోరాట ఫలితమని చెప్పారు. ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించటం తేజస్వీ అహంకారానికి నిదర్శనమన్నారు. మహోన్నత ఉద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చటం చరిత్రను అవమానించటమే అని హరీష్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇదే విధంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్వీట్లో తేజస్వీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ ప్రజలను కించపరిచినట్లే ఇపుడు తేజస్వీ కూడా అవమానించారని మండిపోయారు.

