రాజకీయపార్టీలకు 5 నెలలు జాతరేనా ?
5 నెలల వ్యవధిలోనే ఒక్కసారిగా ఇన్ని ఎన్నికల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, టీఆర్ఎస్, జనసేన రెడీ అవుతున్నాయి
రాబోయే 6 నెలల్లో తెలంగాణను వరుస ఎన్నికలు హోరెత్తించేయబోతున్నాయి. నవంబర్ నెల నుండి సుమారు 5 నెలల పాటు అన్నీ రాజకీయపార్టీలకు జాతర అనే చెప్పాలి. మామూలుగా జాతర సమయాల్లో జనాల్లో ఎంతటి హడావుడి కనబడుతుందో అంతే హడావుడి పార్టీల్లో కనబడటం ఖాయం.
ఎస్ఐఆర్ ప్రక్రియ నవంబర్ 5వ తేదీన ముగియగానే పెండింగులో ఉన్న జిల్లా పరిషత్ ఎన్నికలు, గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలతో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు జరగబోతున్నాయి. అలాగే రాబోయే ఫిబ్రవరి-మార్చిలో రెండు గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ స్ధానాలకు ఎన్నికలు జరుగుతాయి. బీఆర్ఎస్ ఎంఎల్ఏ దానం నాగేందర్ పైన హైకోర్టు అనర్హత వేటు వేసిన కారణంగా ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాల్సుంది.
సుమారు 5 నెలల వ్యవధిలోనే ఒక్కసారిగా ఇన్ని ఎన్నికల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, టీఆర్ఎస్, జనసేన రెడీ అవుతున్నాయి. కాబట్టి నవంబర్ తర్వాత 5 నెలలు తెలంగాణ పార్టీలకు జాతరనే చెప్పాలి.
