‘ప్రజలే బీఆర్ఎస్ ను బ్యాన్ చేస్తారు’
x
Kalvakuntla Kavitha and Harish Rao

‘ప్రజలే బీఆర్ఎస్ ను బ్యాన్ చేస్తారు’

పెద్దచేప కాంట్రాక్టుల్లో వాటాలు దక్కనందుకే గుంటనక్క నానా యాగీచేస్తున్నట్లు ఆరోపించారు


తొందరలోనే ప్రజలు బీఆర్ఎస్ ను బ్యాన్ చేస్తారని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతు నైనీ, సింగరేణి బొగ్గుగనులపై కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణలపై తనదైన స్టైల్లో స్పందించారు. కవిత ఏమంటారంటే సింగరేణికి బీఆర్ఎస్ కూడా తీరని ద్రోహం చేసిందట. బీఆర్ఎస్ హయాంలో సింగరేణికి రు. 25 వేల కోట్లు నష్టాల్లో కూరుకుపోతే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మరో రు. 25 వేల కోట్లు నష్టాలు చేరినట్లు చెప్పారు. చిన్నచేపలాంటి సృజన్ రెడ్డి గురించి గుంటనక్క(హరీష్) ఎందుకు పదేపదే మాట్లాడుతున్నాడో అర్ధంకావటంలేదన్నారు. పెద్దచేప మెఘాసంస్ధకు రు. 25 వేల కోట్ల కాంట్రాక్టులు ఇవ్వటానికి ప్రభుత్వం రెడీ అవుతున్నపుడు చిన్నచేపగురించి మాట్లాడటం అనవసరమని అభిప్రాయపడ్డారు. పెద్దచేప కాంట్రాక్టుల్లో వాటాలు దక్కనందుకే గుంటనక్క నానా యాగీచేస్తున్నట్లు ఆరోపించారు.

నిజానికి సృజన్ రెడ్డికి మొదట్లో సింగరేణి కాంట్రాక్టులు ఇప్పించిందే గుంటనక్క అన్నారు. బీఆర్ఎస్ హయాంలో కాంట్రాక్టులు ఇప్పించినపుడు రేవంత్ కు సృజన్ బావమరిది అన్న విషయం గుంటనక్కకు తెలీదా అని నిలదీశారు. గుంటనక్కను గుడ్డిగా ఫాలో అయి కేటాఆర్ గుంతలో పడుతున్నారని ఎద్దేవాచేశారు. 2014 నుండి ఇప్పటివరకు సింగరేణిలో అవినీతిపై విచారణ చేయాలని గుంటనక్క డిమాండ్ చేయటం ద్వారా కేసీఆర్ పాలనలో కూడా అవినీతి జరిగిందని అంగీకరించటమే అన్న విషయాన్ని గుర్తుచేశారు. పార్టీలో ఉంటూనే కేసీఆర్ కు గుంటనక్క ద్రోహం చేస్తోందని మండిపోయారు. ఛానల్ ను బీఆర్ఎస్ బ్యాన్ చేయటం కాదని తొందరలో ప్రజలే బీఆర్ఎస్ ను బ్యాన్ చేయబోతున్నారని అన్నారు.

బీఆర్ఎస్ హయాంలో కూడా ఇప్పటిలాగే కార్మికుల కష్టాలను పట్టించుకోలేదన్నారు. మేఘా అనే పెద్ద తిమిలింగాన్ని రక్షించేందుకే బీఆర్ఎస్ చిన్నచేప చుట్టూ టెండర్ల వ్యవహారాన్ని తిప్పుతున్నట్లు ఆరోపించారు. మేఘాకు ఇవ్వబోతున్న రు. 25 వేల కోట్ల కాంట్రాక్టు గురించి బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడటంలేదు అని ప్రశ్నించారు. సింగరేణి విషయంలో బీఆర్ఎస్ హయాంలో కూడా చాలా తప్పులు చేసిందన్నారు. పెద్ద కాంట్రాక్టర్ల విషయంలో అందరు ఒకటైపోతారని కవిత ఎద్దేవాచేశారు. జాగృతి మాత్రమే కార్మికుల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తోందన్నారు.

రెండేళ్ళుగా కార్మికుల సమస్యల గురించి ఎన్నిసార్లు మాట్లాడినా స్పందించని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒక కాంట్రాక్టర్ కు అన్యాయం జరిగిందని తెలియగానే మాట్లాడారని విమర్శించారు.

బీఆర్ఎస్ హయాంలో సింగరేణిలో జరిగిన విషయాలపై గుంటనక్క అబద్ధాలు చెప్పారని కవిత మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్సెస్ టెండర్లు ఇవ్వలేదని కేటీఆర్ చెప్పటం అబద్ధమన్నారు. హరీష్ మాటలువిని కేటీఆర్ కూడా గుడ్డిగా అబద్ధాలు చెప్పినట్లు తెలిపారు. చాలా టెండర్లను ఎక్సెస్ రేట్లకే బీఆర్ఎస్ హయాంలో ఇచ్చారన్నారు. 36, 16, 7, 8 ఎక్సెస్ రేట్లకు టెండర్లు ఫైనల్ అయినట్లు కవిత బయటపెట్టారు. తొందరలోనే నైనీ కోల్ బ్లాక్ విజిట్ కు జాగృతి తరపున ఒక బృందం అద్యయనం కోసం వెళుతుందని కవిత చెప్పారు. మొత్తానికి కాంగ్రెస్ పైన హరీష్, కేటీఆర్ ఆరోపణలతో విరుచుకుపడుతుంటే, ఈ ఇద్దరిపైనా కవిత సెటైర్లతో విరుచుకుపడుతున్నారు.

Read More
Next Story