బీజేపీలో చేరిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
x
బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

బీజేపీలో చేరిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

ఎన్నికల ముందు కాంగ్రెస్ కు షాక్


Click the Play button to hear this message in audio format

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - కమాలాఖ్య దే పురకాయస్థ, శశికాంత దాస్, బసంత దాస్ గురువారం అస్సాంలో అధికారికంగా బీజేపీలో చేరారు. వీరితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. వారందరినీ ఇక్కడ జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పబిత్ర మార్గెరిటా సమక్షంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ సైకియా పార్టీ కండువా కప్పారు.

అస్సాం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భూపెన్ బోరా కాషాయ పార్టీలో చేరిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. 126 మంది సభ్యులున్న అస్సాం అసెంబ్లీకి ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. పురకాయస్థ, కరీంగంజ్ (ఉత్తర) నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా, శశికాంత, బసంత వరుసగా రహాలు మంగళ్‌డోయ్ (ఎస్సీ) నియోజకవర్గాల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు.
కాంగ్రెస్ మాజీ జాయింట్ సెక్రటరీ పర్షా బాబ్ కలిత, తృణమూల్ కాంగ్రెస్ మాజీ జనరల్ సెక్రటరీ కంకన్ నాథ్ కూడా కాంగ్రెస పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మకు సన్నిహితులుగా చెప్పబడుతున్న ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీకి బహిరంగంగా మద్దతు ఇస్తున్నారు.
శశికాంత దాస్ 2021లో అధికార పార్టీ విధానాలకు మద్దతు ప్రకటించారు. ఫిబ్రవరి 22న బోరా బీజేపీలో చేరడంతో కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ తగిలింది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అబ్దుల్ రషీద్ మోండల్, షెర్మాన్ అలీ అహ్మద్ గత నెలలో రైజోర్ దళ్‌కు మారారు. మోండల్, అహ్మద్ ఇద్దరూ వరుసగా గోల్పారా (పశ్చిమ) బాగ్‌బార్ నుంచి మూడుసార్లు శాసనసభ్యులుగా ఉన్నారు.
Read More
Next Story