చిట్యాల మునిసిపల్ ఎన్నికలలో ట్రాన్స్ జెండర్ గెలుపు దేనికి సంకేతం ?
x
ట్రాన్స్ జెండర్, నల్గిల్ల సుధాకర్ అలియాస్ అశ్విని

చిట్యాల మునిసిపల్ ఎన్నికలలో ట్రాన్స్ జెండర్ గెలుపు దేనికి సంకేతం ?

• సమస్యలు పరిష్కరించని రాజకీయ పార్టీలపై వ్యతిరేకాకతా! • వ్యక్తిగత మంచితనం కు కిరీటామా ! • జిల్లా రాజకీయాలలో ఆసక్తికర చర్చ


ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులను కాదని చిట్యాల మునిసిపాలిటీ లోని ఒకటవ వార్డ్ ప్రజలు ట్రాన్స్ జెండర్, స్వతంత్ర అభ్యర్థి నల్గిల్ల సుధాకర్ అలియాస్ అశ్విని తమ కౌన్సిలర్ గా ఎన్నుకోవటం దేనికి సందేశం?. తమ సమస్యలకు పరిష్కారం చూపని రాజకీయ నాయకులకు ఈ ప్రజా తీర్పుగా పరిగణించవచ్చనే చర్చ పౌర సమాజంలో చర్చ జరుగుతుంది.

శివనేనిగూడెం వాస్తవానిలో శివారు గ్రామం, కానీ దానిని చిట్యాల మున్సిపాలిటీలో 1956 లో విలీనం చేయటం జరిగింది. తరువాత శివనేనిగూడెం చిట్యాల మునిసిపాలిటీగలో ఒకటవ వార్డుగా కొనసాగుతుంది.
1234 జనాభా కలిగిన శివనేనిగూడెం మొత్తం ఓటర్ల సంఖ్యా 1,070. చిట్యాల మున్సిపాలిటీకి చెందిన డంపింగ్ యార్డ్ శివనేనిగూడెం కు అతిసమీపంలో ఉంటుంది. డంపింగ్ యార్డ్ మూలంగా వచ్చే చెడువాసన, దోమల సమస్యతో శివనేని గూడెం ప్రజలు సతమతం అవుతున్నారు.
ప్రతి ఎన్నికలలో రాజకీయ పార్టీల అభ్యర్థులు డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కరిస్తాం అని హామీలు గెలిచినా తరువాత మర్చిపోయారని చెప్పవచ్చు. ఈ సమస్యతోపాటు, సరైన వీధి దీపాలు, సీసీ రోడ్లు లేక, కోతుల బెడద తో సతమతం అవుతున్నారు.
గతంలో వార్డ్ కౌన్సిలర్ లుగా పనిచేసిన రాజకీయ నాయకులు వారి సమస్యలను పరిష్కరించక పోవటం వల్లనే ప్రజలు స్వతంత్ర అభ్యర్థి అయిన ట్రాన్స్ జెండర్ ని తమ కౌన్సిలర్ గా ఎన్నుకున్నారా ?

ఎవరు ఈ నల్గిల్ల సుధాకర్ అలియాస్ అశ్విని?

నల్గిల్ల నర్సింహా, ముత్తమ్మ దంపతులకు ఐదవ సంతానం సుధాకర్. ఈ దంపతులకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతురులు. సుధాకర్ పదవ తరగతి వరకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువు కున్నారు. ఆ తరువాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల చదువుకు స్వస్తిచెప్పారు.
తాను ట్రాన్స్ జెండర్ గా మారిన నేపధ్యం గురుంచి చెప్పటానికి సుధాకర్ ఇష్టపడటం లేదు. తనలోని కొన్ని అసాధారణ లోపలే ట్రాన్స్ జెండర్ గా మరేటట్లు చేస్తినట్లు తెలిపారు.
స్థానికుల కథనం ప్రకారం చదువు మానేసిన తరువాత అదృశ్యం అయిన సుధాకర్, చదువు ఆపివేసిన తరువాత పని కోసం బొంబాయి వెళ్ళిన సుధాకర్ ట్రాన్స్ జెండర్ గా మారి పది సంవత్సరాల క్రితం సుధాకర్ సొంత ఊరికి తిరిగివచ్చారు. ఈ ప్రాంతంలోని ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీలో పెద్దగా ఆమెను 'అమ్మమ్మ' అని పిలుస్తారని తెలియవచ్చింది.
వార్డులోని ఆడ బిడ్డల పెళ్ళికి ఆర్ధిక సహాయం అందిస్తూ , ఆపద సమయంలో పేదవారికి సాయంగా నిలబెడుతున్నారు. ఇది సుధాకర్ కు స్థానిక ప్రజలలో మంచి అభిప్రాయం ఏర్పడింది.

ట్రాన్స్ జెండర్ సుధాకర్ ఎందుకు ఎన్నికలలో పోటీచేశారు?

అనేక సమస్యలు తన వార్డులో సంవత్సరాలుగా పరిష్కారంకు నోచని సమస్యల పరిష్కారం కు తాను ఎన్నికలలో పోటీచేయటమే మార్గం అని సుధాకర్ భావించారు. అందుకే సుధాకర్ చిట్యాల మున్సిపాలిటీ ఒకటవ వార్డ్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసారు.
ఫింగర్ రింగ్ గుర్తు ఎన్నికలలో ఆమెకు కేటాయించారు. ఆమె నిర్వహిచిన ఎన్నిక ప్రచారం కు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. అది ఆమెలో ఆత్మవిశ్వాసం పెంచి మరింత ముందుకు తీసుకువెళ్ళింది.

ఎన్నికల హామీలు !

వార్డులోని ఆడ పిల్లల పెళ్ళికి 10 ,116 రూపాయల వ్యక్తిగత ఆర్ధిక సహాయం, వీధి దీపాల ఏర్పాటు, సీసీ రోడ్ల నిర్మాణం, కోతుల సమస్య పరిష్కారం ట్రాన్స్ జెండర్ అభ్యర్థి ఇచ్చిన ఎన్నికల హామీలు. ఇచ్చిన మాటమీద నిలబడే వ్యక్తి అని పేరువున్న ఆమె వైపు ఓటర్లు మొగ్గు చూపారు. ఆమె చేసిన సేవ కార్యక్రమాలే ట్రాన్స్ జెండర్ అభ్యర్థికి స్టార్ క్యాంపెయినర్ మారాయి, ఆమె గెలుపుకు దారి వేసాయి.
సుధాకర్ కాంగ్రెస్ మద్దతు ఉన్న సీపీఎం అభ్యర్థి జిట్టా నగేష్‌ను 101 ఓట్ల తేడాతో ఓడించారు. వార్డులోని 1,070 మంది ఓటర్లలో, సుధాకర్ 429 ఓట్లను సాధించి గెలుపును కైవసం చేసుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా లో మొదటి ట్రాన్స్ జెండర్ మున్సిపల్ కౌన్సిలర్ గా ఆమె చరిత్రలో నిలవనున్నారు.

నా జీవితం మరికొందరికి స్ఫూర్తి కావాలి: సుధాకర్ మనోగతం

ట్రాన్స్ జెండర్ కౌన్సిలర్ సుధాకర్ ది ఫెడరల్ -తెలంగాణ తో మాట్లాడుతూ తన ట్రాన్స్ జెండర్ జీవితంలో అనేక పార్శ్వాలను చేసానని, సమాజంలో ఉన్న వివక్షత తీవ్రత మనిషి జీవితాలను దుర్భరం చేస్తుందన్నారు.
ట్రాన్స్ జెండర్ అనే కాదు, కుల, ఆర్ధిక వివక్షతలు కుడా సమాజంలో తీవ్రంగా ఉన్నవి. వీటికి పరిష్కారం ఆ వర్గాల వారు రాజ్యాధికారంలో భాగస్వామ్య కావటమే అన్నారు. దీనికి ఉన్న ఏకైక మార్గం, ఎన్నికలలో పోటీచేసి గెలవటమే అన్నారు.
తన వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూడకుండా, తన ఎన్నికల గెలుపు మరింత మందికి స్ఫూర్తి నిచ్చే కోణంలో మీడియా దృష్టి సారించాలన్నారు.
తాను ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని ఆమె పునరుద్ఘాటించారు. తన రాజకీయ జీవితం కౌన్సిలర్ తోనే ఆగిపోదని ఆమె ధీమా వ్యక్తం చేసారు.
Read More
Next Story